KTR Tweet: ఇది బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కాదు.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

తెలంగాణ లోక్‌స‌భ ఎన్నిక‌లకు కౌంట్ డౌన్ మొద‌లైంది. మ‌రో 4 రోజుల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న స‌మ‌యంలో ప్ర‌ధాన పార్టీల నేత‌లంద‌రూ ప్రచారాన్ని ముమ్మ‌రం చేశారు.

  • Written By:
  • Updated On - May 9, 2024 / 11:19 AM IST

KTR Tweet: తెలంగాణ లోక్‌స‌భ ఎన్నిక‌లకు కౌంట్ డౌన్ మొద‌లైంది. మ‌రో 4 రోజుల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న స‌మ‌యంలో ప్ర‌ధాన పార్టీల నేత‌లంద‌రూ ప్రచారాన్ని ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలోనే అధికార పార్టీ కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష పార్టీ బీఆర్ఎస్‌, బీజేపీ, ఎంఐఎంలు దూసుకుపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఉద‌యం ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ (KTR Tweet) చేశారు. ఈ ట్వీట్‌లో కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాకుండా సెటైరిక‌ల్‌గా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం ఆ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read: TS : నేడు తెలంగాణలో పర్యటించనున్న రాహుల్‌ గాంధీ

ఆ ట్వీట్‌లో కేటీఆర్ ఇలా రాసుకొచ్చారు. నేను చెప్ప‌బోయే ఆ ఆరు వ‌స్తువుల‌ను గ్యారెంటీగా మీరు మీతో ఉంచుకోవాలి లేదంటే ఇబ్బంది పడ‌తార‌ని ఈ కింది వ‌స్తువుల‌ను పేర్కొన్నారు.

– ఇన్వర్టర్
– ఛార్జింగ్ బల్బులు
– టార్చ్ లైట్లు
– కొవ్వొత్తులు
– జనరేటర్లు
– పవర్ బ్యాంకులు

ఇది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తుంచుకోండి.. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కాద‌ని గుర్తుచేశారు. అంతేకాకుండా మే 13వ తేదీన జ‌రిగే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్‌ను గెలిపించాల‌ని కోరారు. ఈ ట్వీట్‌పై పాజిటివ్‌, నెగిటివ్ కామెంట్స్ వ‌స్తుండ‌టం విశేషం. ఇప్ప‌టికే బీఆర్ఎస్ త‌ర‌పున కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీష్ రావు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. అంతేకాకుండా ఈ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి 8 నుంచి 10 సీట్లు వ‌స్తాయ‌ని చెప్పుకుంటున్నారు.

We’re now on WhatsApp : Click to Join

తెలంగాణ‌లో మొత్తం 17 లోక్‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మే 13వ తేదీన ఈ 17 స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ప‌లు స‌ర్వేలు అటు కాంగ్రెస్‌కు ఫేవ‌ర్‌గా వ‌చ్చాయి. ఈసారి బీజేపీ కూడా కొన్ని స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని ధీమాగా ఉంది. బీఆర్ఎస్ కూడా 8 స్థానాల్లో విజ‌యం ఖాయ‌మ‌ని చెప్పుకుంటుంది. అయితే జూన్ 4వ తేదీన ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయో తేల‌నుంది. అప్ప‌టివ‌ర‌కు అన్ని పార్టీలు ఫ‌లితాల కోసం ఆగాల్సిందే.