Site icon HashtagU Telugu

Rajagopal Election Stunt: మునుగోడులో ముందే మేల్కొన్న రాజగోపాల్!

Rajagopal Reddy

Rajagopal Reddy

ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఉప ఎన్నికల్లో గెలిస్తేనే ఆయనకు బీజేపీలో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. తనను పక్కనబెట్టిన కాంగ్రెస్ పార్టీకి, విజయం సాధించి తానెంటో నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే జిల్లా అధికార యంత్రాంగాన్ని, పోలీసులను ఉపయోగించి, తన ఆర్థిక వనరులన్నింటినీ కట్ చేసి తన డబ్బు పంపిణీ మార్గాలన్నింటిని అడ్డుకోకునే అవకాశాలున్నాయని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నాడు. అధికార పార్టీ టీఆర్ఎస్ ఆంక్షలు విధిస్తే.. ఓటర్లకు, స్థానిక నేతలకు డబ్బులు పంచేందుకు వీలులేదు. కాబట్టి ఇప్పటికే స్థానిక నాయకులు, ఓట్లర్లకు దగ్గరవుతూ, డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే మండల, గ్రామస్థాయి నాయకులకు కొంత మొత్తంలో డబ్బులు పంపిణీ చేశాడని ఇతర పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఓటర్లకు అందజేయాల్సిన డబ్బులను కూడా ‘సురక్షిత’ ప్రదేశాల్లో ఉంచారు. కాబట్టి టీఆర్‌ఎస్ ప్రభుత్వం, పోలీసులు ఎంతగా ప్రయత్నించినా ఓటర్లకు డబ్బు పంపిణీకి అడ్డుకట్ట పడలేదు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ అనుభవం నుంచి రాజగోపాల్‌ రెడ్డి పాఠాలు నేర్చుకున్నట్లు సమాచారం. డబ్బు చివరి మనిషికి చేరేలా చూసేందుకు స్ట్రాటజీతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్‌ నేతలను ‘కొనుగోలు’ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీకి రహస్యంగా పని చేసేందుకు డబ్బులు చెల్లించారని పలువురు వాదిస్తున్నారు. వాళ్లంతా టీఆర్‌ఎస్‌లోనే ఉంటూ టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేస్తారు. అయితే పోలింగ్ రోజున తమ మద్దతుదారులను బీజేపీకి ఓటు వేయేలా చేస్తారు. ఈ వ్యూహాలతోనే టీఆర్‌ఎస్‌ను గద్దె దించవచ్చని రాజగోపాల్‌రెడ్డి భావిస్తున్నారు.