Group – 3 Exam : గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు ఛాన్స్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే ?

Group - 3 జాబ్స్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో సవరణలు చేసుకునే అవకాశం ఇది.

  • Written By:
  • Updated On - August 15, 2023 / 01:16 PM IST

Group – 3 Exam : గ్రూప్-3 జాబ్స్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో సవరణలు చేసుకునే అవకాశం ఇది. క్యాండిడేట్స్ ఆగస్టు 16న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 21న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల్లో తప్పులుంటే ఎడిట్ చేసుకొని మార్పులు చేయొచ్చని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. కేవలం ఒక్కసారి మాత్రమే దరఖాస్తులను సవరించుకునేందుకు అవకాశం ఇచ్చారు. కాబట్టి వివరాలు మార్చుకునేవారు జాగ్రత్తగా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. గతేడాది డిసెంబర్‌లో గ్రూప్‌-3 ద్వారా 1,363 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దీనికి 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

త్వరలోనే Group – 3 పరీక్ష షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. గ్రూప్‌-3 అభ్యర్థులకు మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్, పేపర్-2లో హిస్టరీ, పాలిటీ & సొసైటీ, పేపర్-3లో ఎకానమీ & డెవలప్‌మెంట్ ఉంటాయి. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ఆన్సర్ కు ఒక్కో మార్కు ఉంటుంది. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో ప్రశ్నపత్రం ఉంటుంది. గ్రూప్-3 నోటిఫికేషన్ ద్వారా 667 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 436 సీనియర్ అకౌంటెంట్ పోస్టులు, 126 ఆడిటర్ పోస్టులు, 61 సీనియర్ ఆడిటర్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఆడిటర్ పోస్టులు, 61 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 1 అకౌంటెంట్ పోస్టు భర్తీ చేయనున్నారు.

Also Read:  Google Doodle : ఆగస్టు 15 వేళ ఈ డూడుల్ తో గూగుల్ శుభాకాంక్షలు చెప్పింది