Site icon HashtagU Telugu

Food Contest: ‘బాహుబలి థాలీ’ తినండి.. ప్రైజ్ మనీ గెలుచుకోండి!

Food

Food

మనలో చాలామంది భోజన ప్రియులు ఉంటారు. ఎప్పుడెప్పుడా అని కొత్త రకం వంటకాలను టేస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అంతేకాదు.. వంటల పోటీల్లోనూ పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతుంటారు. ఈ నేపథ్యంలో పానీపూరి తినేవాళ్లకు బహుమతులు అందించిన హోటల్స్ సైతం ఉన్నాయి. ఫుడ్ అమితంగా ఇష్టపడేవాళ్ల సరికొత్త చాలెంజ్స్ పుట్టుకొస్తున్నాయి. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఈ ఫుడ్ ఛాలెంజ్‌లో పాల్గొనండి.

మణికొండలోని ‘దక్షిణ్ గార్డెన్స్’ అనే రెస్టారెంట్ కేవలం 40 నిమిషాల్లోనే భారీ బాహుబలి థాలీని ఆరగించి, రూ. 2,000 నగదు బహుమతిని గెలుచుకునేలా కస్టమర్లకు అదిరిపొయే ఆఫర్స్ ను ప్రకటించింది. అయితే ఫుడ్ ఛాలెంజ్‌లో ఒక వ్యక్తి మాత్రమే పాల్గొంటాడు. ఇందులో గరిష్టంగా ఐదు నుండి ఏడు వంటకాలు ఉంటాయి. ఈ థాలీలో (వెజ్ తో పాటు నాన్ వెజ్) రెండు కుండల బిర్యానీలు, రాగి సంగటి, మటన్, చేపలు, పాపడ్, మిర్చి బజ్జీలు, పెరుగు, పూరీలు, రోటీలు, ఐస్ క్రీం వంటి 28 వంటకాలు ఉన్నాయి.

“మేం ఇతర రెస్టారెంట్లకు భిన్నంగా ముందుకు వెళ్లాలని అనుకున్నాం. మెనూ లేదా భోజనాన్ని ప్రచారం చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఇటీవల ప్రారంభించిన తరువాత, ఇప్పటివరకు చాలా మంది ఈ చాలెంజ్ ను స్వీకరించారు. కానీ ఒక్కరూ మాత్రమే విజయం సాధించారు. 30 ఏళ్ల మహిళ 30 నిమిషాల్లో థాలీని పూర్తి చేసి నగదు బహుమతిని గెలుచుకుంది” అని రెస్టారెంట్ యజమాని ఇతర రాష్ట్రాల నుండి సందర్శించే కస్టమర్‌లు పోటీలో గెలిస్తే వారి టిక్కెట్ లేదా బస్సు లేదా విమాన ఛార్జీలను తిరిగి పొందుతారని చెప్పారు.