Site icon HashtagU Telugu

Shadnagar : దళిత మహిళపై థర్ట్‌ డిగ్రీ ఘటన.. ఐదుగురు పోలీసులు సస్పెండ్

Third degree incident against Dalit woman.. Five policemen suspended

Third degree incident against Dalit woman.. Five policemen suspended

Shadnagar Police Station: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలిస్ స్టేషన్ లో దళిత మహిళను చిత్రహింసలకు( థర్డ్ డిగ్రీ) గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనను పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్​గా తీసుకున్నారు. షాద్‌నగర్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ (డీఐ) రామిరెడ్డితోపాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. అంతేకాక తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మేరకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఘటనపై నివేదిక సమర్పించాలని ఏసీపీని సీపీ అవినాశ్ మహంతి ఆదేశించారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రంగస్వామి తన నివేదికను సీపీకి సమర్పించారు. నివేదిక ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిని సస్పెండ్‌ చేసినట్లు సీపీ వెల్లడించారు.

కాగా, బంగారం  దొంగతనం కేసు ఆధారంగా సునీత, 35 ఏళ్ల మహిళ మరియు ఆమె భర్త భీమయ్యను షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించినప్పుడు, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు సునీతను చిత్రహింసలకు గురిచేశారు. సునీత తన ఆరోపణలను ఆగస్టు 4, ఆదివారం నాడు బహిరంగపరిచారు మరియు ఫిర్యాదుపై అధికారిక విచారణ ఆధారంగా షాద్‌నగర్ పిఎస్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేశారు.

Read Also: Ram Charan : చరణ్ అన్న బాగా చీటింగ్ చేస్తాడు.. నిహారిక కామెంట్స్ వైరల్..