Jeevan Reddy: ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు తెలుసు, కేటీఆర్ పై జీవన్ రెడ్డి ఫైర్

సమాజాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యానికి బానిసలుగా చేసిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.

  • Written By:
  • Updated On - December 14, 2023 / 02:43 PM IST

Jeevan Reddy: తెలంగాణ సమాజాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యానికి బానిసలుగా చేసిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. కొత్త ప్రభుత్వాన్ని దీవించకుండా.. ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తానని మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) పేర్కొనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తమకు తెలుసు అని చురకలు అటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజాసంక్షేమమే ముఖ్యమని, మద్యం దుకాణాలను తొలగొంచి విముక్తి కల్పిస్తామని స్పష్టం చేశారు.

60 వేల కోట్లు ఉన్న అప్పులను 6 లక్షల కోట్లకు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సమాజాన్ని మద్యానికి బానిసలుగా చేశారని చెప్పారు. 8 వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని 40 వేల కోట్లకు తీసుకెళ్లారని వెల్లడించారు. ఆయన జగిత్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలనే ఆయన రైతుబంధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతుబంధు డబ్బులు పోతున్నాయని ఆరోపణలు గుప్పించారు. ధరణిలో పేరుండి భూమి లేని వారి గురించి పునరాలోన చేయాలన్నారు జీవన్ రెడ్డి. సాగు చేసే భూములకే రైతుబంధు అందేలా చూడాలని చెప్పారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ డబ్బులు రైతుల ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Nara Lokesh: చంద్రబాబు అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం : నారా లోకేశ్