Site icon HashtagU Telugu

Brothel : వామ్మో..వీళ్లు మాములు భార్యాభర్తలు కాదు

Wife And Husband

Wife And Husband

వరంగల్ (Warangal) నగరంలో వ్యభిచార గృహాల (Brothel Houses) నిర్వహణ రోజురోజుకీ పెరిగిపోతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంతగా పోలీసులు (Police) కఠిన చర్యలు తీసుకున్నా.. పేద కుటుంబాల అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్న గ్యాంగ్‌లు తమ చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గవిచర్ల రోడ్డులో రాజీవ్, సునీత (Rajeev & Sunitha) అనే దంపతులు వ్యభిచార దందా నడుపుతున్నట్టు సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి వారి నుంచి ఒక బాధిత యువతిని రక్షించారు.

Missile Testing Center: ఏపీ‌లో మిస్సైల్ టెస్టింగ్ సెంటర్.. ఎక్కడో తెలుసా ?

రాజీవ్, సునీత దంపతులు ఇదివరకే ఇదే విధంగా వ్యభిచారం నిర్వహిస్తూ అరెస్ట్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. జైలు శిక్ష అనంతరం మళ్లీ అదే పని ప్రారంభించడం ఆందోళనకరం. వారి వద్ద నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు, రూ.1500 నగదు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ దందా పక్కా ప్రణాళికతో జరుగుతున్నదని స్పష్టమవుతోంది. గతంలో కరీంనగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని కూడా వీరి వలలో పడినట్టు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల ఆపదను ఆసరాగా చేసుకుని, డబ్బు ఆశ చూపి యువతులను ఈ రొంపులోకి దింపుతున్న మోసగాళ్లపై మరింత కఠిన చర్యలు అవసరం అని స్థానికులు అంటున్నారు.

వరంగల్‌లో ఇదే తరహా గ్యాంగులు పనిచేస్తున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ, ఇటువంటి సంఘటనలపై నిఘాను కఠినంగా కొనసాగిస్తూ, ఎక్కడైనా సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాజీవ్, సునీతలపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలు అమలు చేసి మరోసారి ఇలాంటివి చేసేందుకు వీలులేని పరిస్థితిని ఏర్పరచాలని కోరుతున్నారు. వ్యభిచారంలో ప్రాణాలు నష్టపోతున్న యువతుల భవిష్యత్తును కాపాడాలంటే పోలీసులు, ప్రభుత్వం కుదురుగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.