Bank Loans Evasion : బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఎవరైనా సామాన్యులు, చిరువ్యాపారులు, రైతులు కనీసం లక్ష రూపాయలు అప్పు బకాయీ ఉన్నా మామూలుగా సతాయించరు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల రికవరీ టీమ్‌ల వేధింపులు దారుణంగా ఉంటాయి. కానీ బడా పారిశ్రామిక వేత్తలు వందల కోట్లు, వేల కోట్ల అప్పులను ఈజీగా ఎగవేస్తుంటారు. తాజాగా అందుకు సంబంధించిన గణాంకాలు బయటికి వచ్చాయి. ఈ లిస్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి.
Also Read :CV Anand : నేషనల్ మీడియాను కొనేశారంటూ వ్యాఖ్యలు.. క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ చేసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక సమాచారాన్ని అందించింది. ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు అప్పులను ఎగ్గొట్టిన టాప్ 100 కార్పొరేట్ కంపెనీల లిస్టును అందించింది. ఈ లిస్టులో పలు తెలుగు రాష్ట్రాల కంపెనీలు కూడా ఉన్నాయి. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ రూ.2,919 కోట్ల అప్పును(Bank Loans Evasion) ఎగవేసింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ రూ.1,960 కోట్ల అప్పు ఎగ్గొట్టింది. ఐవీఆర్‌సీఎల్ రూ.842 కోట్ల అప్పును ఎగవేసింది. వీఎంసీ సిస్టమ్స్ రూ.669 కోట్ల అప్పును ఎగ్గొట్టింది. సురానా ఇండస్ట్రీస్ రూ.594 కోట్ల అప్పును ఎగవేసింది. బీఎస్ లిమిటెడ్ రూ.477 కోట్ల అప్పును ఎగ్గొట్టింది. కోనసీమ గ్యాస్ పవర్ రూ.386 కోట్ల అప్పును ఎగవేసింది. ఈ లిస్టులో ఉన్న మన దేశంలోని ప్రముఖ కంపెనీలలో గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ కంపెనీ ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు రూ.8516 కోట్ల అప్పును ఎగ్గొట్టింది. ఏబీజీ షిప్ యార్డ్ కంపెనీ రూ.4684 కోట్ల అప్పును ఎగవేసింది. కాన్ కాస్ట్ స్టీల్ అండ్ పవర్ రూ.4305 కోట్ల అప్పును ఎగవేసింది. ఈఆర్‌ఏ ఇన్‌ఫ్రా రూ.3637 కోట్ల అప్పును ఎగ్గొట్టింది. ఆర్ఈఐ అగ్రో కంపెనీ రూ.3350 కోట్ల అప్పును ఎగవేసింది.
Also Read :Flashback Sports: 2024లో క్రీడల్లో భారత్ సాధించిన అతిపెద్ద విజయాలివే!
2020 నుంచి ఇప్పటివరకు ఏటా..
- 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 మధ్యకాలంలో మన దేశంలోని 2,154 కంపెనీలు రూ.1.52 లక్షల కోట్ల అప్పులను బ్యాంకులకు ఎగవేశాయి.
- 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 మధ్యకాలంలో దేశంలోని 2,415 కంపెనీలు రూ.1.80 లక్షల కోట్ల అప్పులను ఎగవేశాయి.
- 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 మధ్యకాలంలో దేశంలోని 2533 కంపెనీలు రూ.2.15 లక్షల కోట్ల అప్పులను ఎగవేశాయి.
- 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 మధ్యకాలలో దేశంలోని 2,622 కంపెనీలు రూ.1.96 లక్షల కోట్ల అప్పులను ఎగ్గొట్టాయి.
- 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 మధ్యకాలంలో దేశంలోని 2,664 కంపెనీలు రూ.1.96 లక్షల కోట్ల అప్పులను ఎగవేశాయి.