Site icon HashtagU Telugu

T-Congress Leaders : టీ కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్లే.. లీకైన లిస్ట్

These Are The T Congress Candidates..

These Are The T Congress Candidates..

T-Congress Leaders List Leaked : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పేరుతో ఓ సర్వే రిపోర్టు కాంగ్రెస్ పార్టీలో చ‌ర్చ‌నీయాంశమైయ్యింది. పార్టీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది కాంగ్రెస్ పార్టీ ఆఫీషియల్‌గా సర్వే రిపోర్టును ప్రకటించికపోయినా 119 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించిన ఓ లిస్టు పార్టీ లీడర్ల ఫోన్లలో చక్కర్లు కొడుతున్నది. కొన్ని నియోజకవర్గాలకు ఒక్క పేరును మాత్రమే ప్రతిపాదించగా, మరి కొన్నింటికి మాత్రం సెకండ్, థర్డ్ ప్రాబబుల్స్ పేర్లను ప్రపోజ్ చేసినట్లు స్పష్టమవుతున్నది. పార్టీలో ఇంటర్నల్‌గా లీకైన ఆ సర్వే రిపోర్టు నిజమేనని ఓ కీలక నేత ధృవీకరించారు.

ఇది ఏఐసీసీకి పంపడం కోసం సునీల్ కనుగోలు రూపొందించారని ఆ నేత పేర్కొన్నారు. ఈ జాబితాలో దాదాపు 75% సీట్లలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతల పేర్లు ఉండటం గమనార్హం. ఇదే విషయం పార్టీ నేతల్లో చర్చకు దారితీసింది. అసంతృప్తికి కారణమైంది. మొదటి నుంచీ పార్టీలో పనిచేస్తున్నా టికెట్‌కు నోచుకోలేకపోయామా? అని బాధపడుతున్నారు. కొన్ని సెగ్మెంట్లలో సెకండ్ ప్రయారిటీ పేరుతో పెట్టిన పేర్లు తెలంగాణ కాంగ్రెస్ (T-Congress) నేతల మధ్య చర్చకు దారితీసింది. ఈ లిస్టు ఫైనలా? లేక ఏఐసీసీ మార్పులు చేస్తుందా?.. ఇప్పటి నుంచే హైకమాండ్ దగ్గర పైరవీలు చేసుకోవాలా?.. ఇది పాత రిపోర్టా?.. లేక కొత్తదా?.. యాధృచ్ఛికంగానే బయటకు లీకైందా?.. లేక ఉద్దేశపూర్వంగా ఎవరైనా లీక్ చేయించారా? అనే సందేహాలు పార్టీ నేతల్లో మొదలయ్యాయి..

51 నియోజకవర్గాల్లో ఇద్దరి చొప్పున పేర్లను సునీల్ కనుగోలు సర్వే రిపోర్టులో ప్రతిపాదించారు. ప్రస్తుతం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న నేతల పేర్లు సైతం ఈ జాబితాలో ఉండటం సరికొత్త సందేహాలకు దారితీసింది. ప్రస్తుతం పార్టీలో లేని వారికి కూడా టిక్కెట్లు రిజర్వు కావడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చంశనీయంగా మారింది. సర్వే రిపోర్టు లీకైన వి…

Also Read:  Hyderabad : హిమాయ‌త్ సాగ‌ర్‌కు భారీగా చేరుతున్న వ‌ర‌ద నీరు.. మ‌రో రెండు గేట్లు తెరిచే ఛాన్స్‌