Site icon HashtagU Telugu

Telangana New Ministers : కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..!!

Ministers Posts

Ministers Posts

తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion)తో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపును ఖరారు చేశారు. గత కొన్ని రోజులుగా శాఖల కేటాయింపు పై రాజకీయ వర్గాల్లో చర్చలు సాగగా, ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సీఎం ఢిల్లీ పర్యటన అనంతరం వచ్చిన ఈ నిర్ణయం, పార్టీ అంతర్గత పరిస్థితులు, అధిష్టానం మార్గదర్శకాల కింద తీసుకున్న చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు.

మంత్రులకు అప్పగించిన శాఖలు

కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్ శాఖలు అప్పగించారు. ఇది రాష్ట్ర ఆదాయానికి, కార్మిక సంక్షేమానికి కీలకమైన రంగాలు. అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు అప్పగించారు. ఈ శాఖల కేటాయింపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని సంకేతం అందిస్తోంది. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, క్రీడలు మరియు యువజన శాఖలు అప్పగించడం ద్వారా గ్రామీణాభివృద్ధి, యువత అభ్యుదయంపై దృష్టి పెట్టే విధంగా సీఎం ఆలోచనలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా శాఖల కేటాయింపుతో కొత్త మంత్రులు రేపు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలో వారికి ప్రత్యేక కార్యాలయాలను సిద్ధం చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. జూన్ 8వ తేదీ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి.. తన కేబినెట్‌‌ను పునర్వ్యవస్థీకరించారు. ఈ సందర్భంగా కేబినెట్‌లోకి కొత్తగా ముగ్గురు ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ (చెన్నూరు), వాకాటి శ్రీహరి (మక్తల్), అడ్లూరి లక్ష్మణ్ (ధర్మపూరి) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Raviteja : మాస్ రాజా రవితేజ కు బిగ్ షాక్ ఇచ్చిన GHMC అధికారులు