Munugode Candidates: మునుగోడు ఉపఎన్నికలో ప్ర‌ధాన పార్టీల‌ అభ్య‌ర్థులు వీరే!

కాంగ్రెస్ పార్టీకీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయ‌డంతో ఏర్పడ్డ ఖాళీ అయిన మునుగోడు అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న

  • Written By:
  • Publish Date - October 3, 2022 / 02:41 PM IST

కాంగ్రెస్ పార్టీకీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయ‌డంతో ఏర్పడ్డ ఖాళీ అయిన మునుగోడు అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న ఉప‌ ఎన్నికలు జరగబోతున్నాయి. సిట్టింగ్ సీటు కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఉపఎన్నికలో గెలిచి ప్రభుత్వానికి సవాల్ విసరాలని చూస్తోంది. అయితే అధికార పార్టీ టీఆర్ఎస్‌, జాతీయ పార్టీ బీజేపీలు కూడా ఈ ఉపఎన్నిక‌లో విజ‌యం సాధించాల‌ని భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడు ప్రధాన పార్టీలు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

అయితే ఈ ఉపఎన్నిక‌లో ప్ర‌ధాన పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. టీఆర్ఎస్ అధికారికంగా ప్ర‌క‌టించ‌కున్నా.. అనాధికారికంగా అభ్య‌ర్థి ఎవ‌రో తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ తమ అభ్యర్థిని ఫైనల్‌ చేసింది. మునుగోడు ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని ఫైనల్‌ చేసింది బీజేపీ.

ఇక‌పోతే.. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వయి స్రవంతి ఫైన‌ల్‌ కాగా.. అటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని బరిలో దించేందుకు టీఆర్‌ఎస్‌ ప్లాన్‌ వేస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక నవంబర్‌ 3న జ‌ర‌గనుంది. ఈనెల 7న మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసి.. నామినేషన్లకు ఈనెల 14వరకు గడువు ఇవ్వ‌నున్నారు. నవంబర్‌ 6న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉండ‌నుంది. న‌వంబ‌ర్ 8తో మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌క్రియ పూర్తి అవుతోంద‌ని ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు.