BRS Party: పార్టీని వీడి వెళ్లినవారిని తిరిగి రానిచ్చేదిలేదు.. బీఆర్ఎస్ మాజీ మంత్రి వార్నింగ్

  • Written By:
  • Updated On - March 19, 2024 / 06:22 PM IST

BRS Party: పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి రానిచ్చేదిలేదని.. భారాస నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు లాభపడి… స్వార్థం కోసం ఇప్పుడు కొందరు పార్టీని వీడుతున్నారని ఆయన మండిపడ్డారు. భారాసతోనే బహుజనులకు న్యాయం జరుగుతుందన్న ఆయన.. అందుకే ఆర్ .ఎస్ .ప్రవీణ్ తమ పార్టీలో చేరారన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలను భయపెడితే.. మరో పోరాటం వస్తుందని హెచ్చరించారు. తాను భాజపాలోకి వెళ్తున్నట్టు వచ్చిన వార్తలను ఖండించిన మాజీ మంత్రి… గుడికి వెళ్తే ఆ పార్టీలో చేరుతున్నారని ప్రచారం చేయటం తగద్నారు.

పార్టీ మారిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపుల కింద అనర్హత వేటువేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ విజ్ఞప్తిచేసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తుపై గెలిచిన నాగేందర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సోమవారం ఆయన స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను కలుసుకున్న విషయం తెలిసిందే. ఇక కేసీఆర్ కూడా స్పందిస్తూ.. పార్టీని వీడేవాళ్లంతా చిల్లరగాళ్లంతో సమానమని అన్నారు.