Jagadish Reddy: తెలంగాణాలో పవర్ కట్ ఉండదు: మంత్రి జగదీశ్

తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని మంత్రి జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Jagadeesh Reddy

Jagadeesh Reddy

హైదరాబాద్ పాత బస్తీలో 1,404.58 కోట్ల వ్యయంతో టి యస్ ట్రాన్స్కో,టి యస్ యస్ పి డి సి ఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ నిర్మాణాలు చేపట్టినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 1,330.94 కోట్ల పనులు పూర్తి కాగా మరో 73.64 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. శుక్రవారం తెలంగాణా శాసనమండలిలో యం ఐ యం కు చెందిన మీర్జా రియాజల్ హసన్, మీర్జా రహమత్ బేగ్ లు అడిగిన ప్రశ్నకు మంత్రి జగదీష్ రెడ్డి సమాధానమిస్తూ పై 1,404.58 కోట్లలో ట్రాన్స్మిషన్ కు గాను ట్రాన్స్కో నుండి 957.29 కోట్లు వెచ్చించగా టి యస్ యస్ పి డి సి ఎల్ 447.29 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన సభకు తెలిపారు.గడిచిన తొమ్మిదేళ్ల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసి విద్యుత్ ప్రసారాలను క్రమబద్దీకరించినట్లు ఆయన పేర్కొన్నారు.

నాలుగు 220 కేవీ సబ్ స్టేషన్లు, 132 కేవీ సబ్ స్టేషన్లు రెండు, 33/11 కే వి సబ్ స్టేషన్లు 15,256 కిలోమీటర్ల 33 కే వి లైన్ తో పాటు 63 ఆదనవు ట్రాన్స్ ఫార్మర్స్ ను ఏర్పాటు చేశామన్నారు.16 ట్రాన్స్ఫార్మర్స్ సామర్ధ్యాన్ని పెంచడం తో పాటు 565 కిలోమీటర్ల 11 కేవీ లైన్ ను వేసినట్లు ఆయన చెప్పారు.అంతే గాకుండా 3,461అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటై చేసి 210 డి టి ఆర్ క సామర్ధ్యాన్ని పెంచమన్నారు.1700 లో టెన్షన్ లైన్ వేయడం తో పాటు 540 కిలో మీటర్ల ఎల్ టి రీ-కండక్టరింగ్ చేశామని ఆయన తెలిపారు. పాత బస్తి కి చెందిన శాసనసభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించి వారి వారి అభ్యర్థన మేరకే ఈ నిర్మాణాలు జరిగాయన్నారు. సబ్ స్టేషన్ల నిర్మాణాల విషయంలో స్థలానికి సంబంధించిన అంశాలు ఆటంకాలు ఎదురైనప్పటికి స్థానిక శాసనసభ్యుల ప్రమేయంతో పరిష్కారం జరిగిందన్నారు.

తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ కోతలకు అష్కారమే లేదని ఆయన తేల్చిచెప్పారు. విపత్తు సమయంలోనూ విద్యుత్ ప్రసారాలలో అంతరాయం కలుగ కుండా చేసిన ఘనత తెలంగాణ విద్యుత్ సంస్థల యజమాన్యాలది అందులో పని చేసే సిబ్బంది దని ఆయన కొనియాడారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలను ఖాతరు చెయ్యకుండా వర్షపు నీటిలో ఈదుకుంటు పోయి పవర్ కట్ లేకుండా చేశారన్నారు.లో ఓల్టేజి సమస్యకు సత్వరమే పరిష్కారం చూపుతున్నారని,ఎల్ సి తీసుకున్న వారే ప్రమాదాలకు బాద్యులు అవుతారని ఆయన స్పష్టం చేశారు.

Also Read: Cow And Snake: ఆవుతో పాము సయ్యాట.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో

  Last Updated: 04 Aug 2023, 06:24 PM IST