Etela Rajender Reaction: పార్టీ మారే ప్రసక్తే లేదు: తేల్చి చెప్పిన ఈటల

తాను కేసీఆర్ (CM KCR) మెతక మాటలకు పడిపోను అని ఈటల రాజేందర్ అన్నారు.

  • Written By:
  • Updated On - February 13, 2023 / 12:26 PM IST

శాసనసభలో (Assembly) ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి ఉండాలని.. మందబలం ఉందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవమానించడం, తిట్టడమే లక్ష్యంగా సభ సాగిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) అన్నారు. సీఎం, మంత్రులు సభలో చెప్పింది తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో సమస్యలు ఉన్నవనేది వాస్తవమని.. బడ్జెట్ సగానికి పైగా లెక్కలు తప్పుల తడక అని విమర్శించారు ఈటల. దేశంలో తరువాత గెలవచ్చని ముందు 2024లో కేసీఆర్ తెలంగాణలో గెలవాలని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ రెడీగా ఉందని.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తాను కేసీఆర్ (CM KCR) మెతక మాటలకు పడిపోనన్నారు. 2004లో కూడా వైఎస్‌తో కలుస్తారని అన్నారని.. ఆనాడు పోలేదు.. ఇప్పుడు పోనని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీ వీడలేదని.. వాళ్లే తనను బయటకు పంపించారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మళ్లీ తనను బీఆర్ఎస్‌లోకి పిలిచినా తాను పోనని క్లారిటీ ఇచ్చారు. ‘ముఖ్యమంత్రి తన స్టైల్‌లో మాట్లాడారని.. భట్టి, అక్బరుద్దీన్ ఒవైసీ, జగ్గారెడ్డి పేరును కూడా అలానే పిలుస్తారు. అసెంబ్లీకి నేను వచ్చింది ప్రజల సమస్యలపై చర్చ కోసం.. ఈటల రాజేందర్ (Etela Rajender) సొంత ఎజెండా కోసం అసెంబ్లీకి రాలేదు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పిలిస్తే కచ్చితంగా చర్చలకు పోతా.. ఎన్ని రోజులు నన్ను అపగలిగారు.. వాళ్ల ఆపగలరా..? నేను బీజేపీలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌ను అది గుర్తుపెట్టుకోవాలి..’ ఈటల హితవు పలికారు. కేసీఆర్ తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రధాని మోదీపై (PM Modi) ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు. మళ్లీ దేశానికి ప్రధాని మోదీనేని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిన లెక్కలు సగానిపైగా తప్పేనన్నారు. తెలంగాణ రాజకీయాల్లో తనకు ప్రత్యేక ఒరవడి ఉందనీ, కేసీఆర్ ప్రభుత్వం కోట్లు కుమ్మరించినా.. హుజారాబాద్ ప్రజలు నా వెంట నిలిచారని ఈటల స్పష్టం చేశారు.

Also Read: BTech Students: బిటెక్ బాబులకు ఐటీ కష్టాలు.. ‘నో’ క్యాంపస్ రిక్రూట్ మెంట్