Vikas Raj: తెలంగాణలో రీ పోలింగ్‌కు అవకాశం లేదు: వికాస్‌రాజ్‌

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ మీడియా సమావేశం ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.

  • Written By:
  • Updated On - December 1, 2023 / 05:07 PM IST

Vikas Raj: హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ మీడియా సమావేశం ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఉన్న వివరాల మేరకు తెలంగాణలో పోలింగ్‌ శాతం 70.79 నమోదైనట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎల్లుండి ఓట్ల లెక్కింపు ఉంటుందని, ఓట్ల లెక్కింపు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుందని అన్నారు.

ఓట్‌ ఫ్రం హోమ్‌ మంచి ఫలితాలు ఇచ్చిందని, ఎన్నికల కోసం 2 లక్షల కంటే ఎక్కువ మంది సిబ్బంది కష్టపడ్డారు. రాష్ట్రంలో రీ పోలింగ్‌కు అవకాశం లేదు అని స్పష్టం చేశారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.03 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని, అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాలో 46.56 శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు.

కౌంటింగ్ సెంటర్ల దగ్గర మూడంచెల భద్రత ఉంటుందని చెప్పారు వికాస్‌రాజ్‌. మొత్తం 40 కంపెనీల భద్రత కల్పిస్తున్నామన్నారు. స్ట్రాంగ్ రూంల దగ్గర సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కౌంటింగ్ సెంటర్లలో 1,766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉంటాయన్నారు. ఆరు నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అక్కడ 28 టేబుళ్లు ఉంటాయన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఉదయం 8.30 గంట‌ల‌ నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలవుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే.. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుందన్నారు వికాస్‌రాజ్‌.