Site icon HashtagU Telugu

​​Medigadda : మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏడో బ్లాక్‌‌లో భారీ బుంగ

Medigadda

Medigadda

​​Medigadda : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో ఏర్పడిన బుంగలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా బ్యారేజీలోని ఏడో బ్లాక్‌ వద్ద ఏరియా క్లియరెన్స్‌ పనుల కోసం నీటిని పూర్తిగా తోడేయగా 20వ పియర్‌ ప్లాట్‌ఫాం ఎదుట పెద్ద బుంగ బయటపడింది. ఈ బుంగను ఇంజినీరింగ్‌ అధికారులు గుర్తించి శుక్రవారం సాయంత్రానికే పూడ్చేశారు. ఏడో బ్లాక్‌ ప్రదేశంలో పలు చోట్ల చిన్న బుంగలు ఏర్పడగా వాటిని కూడా పూడ్చేశారు. ఇక బ్యారేజీ దిగువ భాగాన గతంలో భారీ గొయ్యి ఏర్పడగా 25వేలకు పైగా ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. ఇక ఇన్వెస్టిగేషన్స్‌ పూర్తయితే బ్యారేజీలోని వివిధ బ్లాక్‌లలో ఏర్పడిన బుంగల తీవ్రత, అవి ఏర్పడటానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది.  బుంగలు పడటం అంటే ఫాల్ట్‌జోన్‌ ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. పైన అంతా ఇసుక గట్టిగానే ఉండి మధ్యలో నీటి ప్రవాహం ఉండటం, బర్రీడ్‌ ఛానల్స్‌ ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 85 గేట్లున్నాయి. ఏటా వానాకాలం మొదలు కావడానికి ముందే ఈ గేట్లన్నీ ఎత్తి ఉంచాలని  జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) సూచించింది. ఇందులో భాగంగా ఒకటి నుంచి ఆరో బ్లాక్‌ వరకు, ఎనిమిదో బ్లాక్‌లోను ఉన్న మొత్తం గేట్లను 74 పూర్తి స్థాయి నీటిమట్టం వరకు ఎత్తి ఉంచారు. బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లో మొత్తంగా 11 గేట్లు ఉండగా ఎనిమిది గేట్లపై ప్రభావం ఉండడంతో అవి మూసివేసి ఉన్నాయి.

Also Read :Bank Holidays: జూన్ నెలలో బ్యాంకుల సెలవుదినాలు ఇవే..

దీంతో మొత్తం మీద మేడిగడ్డ(​​Medigadda)బ్యారేజీలోని 77 గేట్లను పైకెత్తారు. రెండు గేట్లను పూర్తిగా తొలగించాలి. వాటిలో ఆరు గేట్లను ఎత్తాల్సి ఉంది. అయితే వాటిలో ఒక గేటును 90 మీటర్ల వరకే ఎత్తారు. మిగిలిన గేట్లన్నీ అలానే ఉన్నాయి. 16వ నంబరు గేటు ఎత్తే ప్రయత్నం చేయగా పగుళ్లు మరింత పెరగడంతో.. దాన్ని ఎత్తలేదు. ఈ నేపథ్యంలో మిగిలిన గేట్లను ఎత్తడం సమస్యగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read :Live 100 Years: నూరేళ్ల ఆయుష్షు కోసం ‘గరుడ పురాణం’ సూత్రాలు

Exit mobile version