Site icon HashtagU Telugu

Khammam: కొత్త కేబినెట్ లో ఖమ్మం నుంచే ముగ్గురు.. అందరి దృష్టి జిల్లా పైనే..!

Khammam

Compressjpeg.online 1280x720 Image 11zon (1)

Khammam: ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్‌ ఏర్పాటు చేయబోతున్న మంత్రివర్గంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam) నుంచే ముగ్గురికి చోటు దక్కింది. ఖమ్మం జిల్లా నుంచే కాంగ్రెస్‌ గాలి వీచిందన్న ప్రచారం, ఒకే పార్టీ నుంచి రాజకీయ దిగ్గజాలు బరిలో దిగి గెలవడంతో జిల్లాకు సముచిత ప్రాధాన్యం ఉంటుందన్న అభిప్రాయాలు నిజం అయ్యాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఖమ్మం జిల్లా పైనే ఉంది. మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. దింతో వారి అభిమానులు, ఖమ్మం జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక జిల్లా నుంచే ముగ్గురు మంత్రులు అవుతుండటంతో జిల్లా కూడా అభివృద్ధి సాధిస్తుందని రాజకీయ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మధిర నియోజకవర్గం నుంచి నుంచి గెలిచిన భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి వరించగా.. ఖమ్మం నుంచి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రివర్గంలో చాన్స్‌ దక్కింది. సామాజిక సమీకరణాలు, అనుభవాలు, బలాబలాలు అన్నింటిని బేరీజు వేస్తున్న అధిష్ఠానం వీరికి ఏ శాఖ అప్పగిస్తుందో అని ఉత్కంఠగా ఉంది.

Also Read: Ministers: తెలంగాణ కొత్త మంత్రులు వీళ్లే.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క..?!

నాలుగోసారి మధిర నుంచి గెలిచిన భట్టి విక్రమార్క తాను నిర్వహించిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్‌కు చాలా ప్లస్ అయింది. అందుకే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి, స్వరాష్ట్ర మంత్రి వర్గాల్లో సుమారు 17ఏళ్లపైగా మంత్రిగా పనిచేసి కాంగ్రెస్‌లో చేరి ఆరోసారి ఖమ్మం నుంచి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు పేరు కూడా కేబినెట్ లిస్ట్ లో ఉంది. ఇక పాలేరు నుంచి గెలిచిన పొంగులేటి పేరు కూడా మంత్రివర్గ జాబితాలో ఉంది. గతంలో ఖమ్మం ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఆయన ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరి పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచారు. అయితే ఒకే జిల్లా నుంచి ముగ్గురు కీలక నేతలకు అవకాశం దక్కడంతో అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

Exit mobile version