Site icon HashtagU Telugu

Telangana BJP Chief : కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ చీఫ్ .. రేసులో ఎనిమిది మంది

Telangana Bjp Chief Race Etela Rajender Arvind Dharmapuri Raghunandan Rao Ramchander Rao

Telangana BJP Chief : తెలంగాణ బీజేపీ చీఫ్ ఎవరు ? అనేది ఈ నెల (జనవరి) చివర్లోగా తేలిపోనుంది. ఈసారి కాషాయ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం భారీ పోటీ నెలకొంది. మునుపటి కంటే రాష్ట్రంలో బీజేపీ స్ట్రాంగ్‌గా ఉన్న ప్రస్తుత తరుణంలో.. పార్టీ పగ్గాలను దక్కించుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. ఈ రేసులో అర డజను మందికిపైనే నేతలు ఉన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రస్తుతం కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు తెలంగాణ పార్టీ పగ్గాలు.. మరోవైపు కేంద్ర మంత్రి పదవి కిషన్ రెడ్డికి భారంగా మారాయి. అందుకే రాష్ట్రానికి కొత్త పార్టీ అధ్యక్షుడిని నియమించే దిశగా కసరత్తు జరుగుతోంది.

Also Read :Prabhsimran: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ హ్యాట్రిక్ శతకాలు.. ప్రీతి పాప హ్యాపీ

Also Read :Decisions By Umpires: కొంపముంచుతున్న అంపైర్ల తప్ప్పుడు నిర్ణయాలు