Site icon HashtagU Telugu

Preeti: ప్రీతి తరహాలో డాక్టర్ల ఆత్మహత్యలు ఎన్నో..! ప్రభుత్వ నిర్లక్ష్యానికి వైద్యం ఏది?

There Are Many Suicides Of Doctors Like Preeti..! What Is The Cure For Government Negligence

There Are Many Suicides Of Doctors Like Preeti..! What Is The Cure For Government Negligence

వైద్య విద్యను చదవటం అంటేనే జీవితాన్ని త్యాగం చేయడం. షికార్లు, ఫంక్షన్ లు ఉండవ్. రోగులతోనే నిత్యం స్నేహం చేయాలి. అలాంటి క్లిష్టమైన వృత్తిని ఎంచుకొని వస్తున్న విద్యార్థుల ప్రాణం పోతుంది అంటే దానికి కారణం సీనియర్లు వేధింపులు, ప్రొఫెసర్ల కామ వాంఛ, కాల పరిమితి లేని డ్యూటీలు వెరసి యువ డాక్టర్ల ప్రాణం తీస్తున్నాయి. ఆ కోవలోకి వచ్చే సంఘటన డాక్టర్ ప్రీతి (Preeti) ఆత్మహత్య. ఈ ఘటన జరిగిన తరువాత కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్యం గా ఉంది. కనీసం విచారణకు అదేశించడానికి కూడా ఆలోచిస్తుంది. ఇంతటి దారుణ పరిస్థితి ఏ ప్రభుత్వంలోనూ ఉండదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఇతర కారణాలతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న యువ డాక్టర్ ల జాబితాను చూస్తే అమ్మో అనిపిస్తుంది.

జాతీయ వైద్య మండలి రిలీజ్ చేసిన రిపోర్టు ప్రకారం భారతదేశంలో గత ఐదు సంవత్సరాలలో 119 మంది మెడికోలు ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రకటించింది. ఐదేళ్లలో 119 మంది వైద్య విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోగా అందులో 64 మంది అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు ఉన్నారు.55 మంది పీజీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించింది. పలు కారణాలతో గత ఐదు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 1,116 మంది విద్యార్థులు మెడిసిన్ కు గుడ్ బై చెప్పారని పేర్కొంది.

అండర్ గ్రాడ్యుయేషన్ లో 160 మంది విద్యార్థులు, పీజీ జనరల్ సర్జరీ లో 114 మంది విద్యార్థులు, గైనకాలజీలో 103 మంది విద్యార్థులు, ఎంఎస్ ఆర్థోపెడిక్స్ లో 50 మంది విద్యార్థులు, ఎమ్మెస్ ఈఎన్టీలో 100 మంది విద్యార్థులు, ఎండి జనరల్ మెడిసిన్ లో 56 మంది విద్యార్థులు, ఎండి పీడియాట్రిక్స్ లో 54 మంది విద్యార్థులు తదితర ఇతర బ్యాచ్ లు కలిపి మొత్తంగా 592 మంది వైద్య విద్యను మధ్యలోనే వదిలి వెళ్ళిపోయినట్టు జాతీయ వైద్య మండలి వెల్లడించింది. ఎంతో ఇష్టంగా కష్టపడి సాధించిన మెడిసిన్ కోర్సుల నుండి విద్యార్థులు ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారు? అన్న దానిపై అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఉంది. అలాగే వైద్య విద్యార్ధుల సూసైడ్స్ పెరుగుతున్న నేపధ్యంలో వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం, కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయటం చెయ్యాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి (Preeti) ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రీతి ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచింది. సీనియర్ వైద్య విద్యార్థి వేధింపులతో ప్రీతి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఇదే సమయంలో ప్రీతి మృతి నేపథ్యంలో విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసుల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో జాతీయ వైద్య మండలి భారతదేశంలో గత ఐదేళ్లలో మెడికల్ ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారు అన్నదానిపైన నివేదికను ఈరోజు రిలీజ్ చేసింది. దాన్ని పరిశీలిస్తే వైద్య విద్య లోని వేధింపులు స్థాయి తెలుస్తుంది.

Also Read:  Revanth Reddy: ప్లీనరీలో పొత్తు మాట! రేవంత్ కు టీడీపీ ఆహ్వానం! టైమింగ్ అదుర్స్!