Investigation : అప్పుడు చంద్రబాబు..ఇప్పుడు కేసీఆర్

Investigation : గత రెండు దశాబ్దాల్లో తెలుగు రాష్ట్రాల్లో విచారణ కమిషన్ ఎదుట హాజరైన రెండో మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలవనున్నారు. ఈక్రమంలో గతంలో ఏలేరు భూకుంభకోణం(Yeleru land compensation scam)పై విచారణకు అప్పటి సీఎం చంద్రబాబు (Chandrababu) హాజరయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Kcr Cbn

Kcr Cbn

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) సంచలనాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project Commission Inquiry)లో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు నేడు కేసీఆర్ (KCR) హాజరయ్యారు. గతంలో ఈటల రాజేందర్, హరీష్ రావు వంటి ప్రముఖులు ఇప్పటికే విచారణకు హాజరైన నేపథ్యంలో, ఇప్పుడు కేసీఆర్ విచారణ కీలక మలుపుగా మారింది. విచారణకు ముందు కవిత కేసీఆర్‌ను ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కలిసి, మద్దతుగా ఉంటానని ప్రకటించిన విషయం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో బీఆర్కే భవన్ వద్దకు చేరడంతో అక్కడ రాజకీయ ఉత్కంఠ నెలకొంది.

Sakshi Office : ఏలూరు సాక్షి ఆఫీస్ లో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదు – డీఎస్పీ క్లారిటీ

గత రెండు దశాబ్దాల్లో తెలుగు రాష్ట్రాల్లో విచారణ కమిషన్ ఎదుట హాజరైన రెండో మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలవనున్నారు. ఈక్రమంలో గతంలో ఏలేరు భూకుంభకోణం(Yeleru land compensation scam)పై విచారణకు అప్పటి సీఎం చంద్రబాబు (Chandrababu) హాజరయ్యారు. ఇప్పుడిక, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో ఏర్పడిన లోపాలు, డిజైన్ సమస్యలు, కాళేశ్వరం కార్పొరేషన్‌ నిర్వహణ తదితర అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమగ్ర విచారణ జరుపుతోంది. ఇప్పటికే కమిషన్ 114 మందిని విచారించినట్టు సమాచారం.

కమిషన్ ఇప్పటివరకు కాగ్ నివేదిక, విజిలెన్స్ శాఖ నివేదికలతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికలను విశ్లేషించింది. నీటిపారుదల శాఖ బాధ్యతలు చేపట్టిన హరీష్ రావు ఇచ్చిన వివరణల ఆధారంగా కేసీఆర్‌కు పంపిన ప్రశ్నావళి సిద్ధమైంది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం రీ-ఇంజనీరింగ్ వరకు, టెండర్ల పద్ధతులు, బ్యారేజీల నిర్వహణపై విస్తృతంగా ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాగా,ఈ ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి కేసీఆర్ పూర్తిగా సిద్ధమయ్యారని సమాచారం.

  Last Updated: 11 Jun 2025, 10:54 AM IST