నల్గొండ జిల్లా ఎన్‌హెచ్ 65లో గల ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. దోపిడీ దొంగలు రూ.23 లక్షల నగదును అపహరించారు. SBI ATMలో రెండు మెషీన్లు ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ ఏజెన్సీ, మరొకటి SBI శాఖ ద్వారా నిర్వహిస్తున్న మెషీన్.. అయితే ప్రవేట్ ఏజెన్సీ మెషీన్‌లో ఉన్న నగదు చోరీకి గురైంది. ఏటీఎం లోపల అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ చోరీ ఘటన రికార్డు అయింది. ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు ఏటీఎంలోకి ప్రవేశించిన దృశ్యాలు రికార్డయ్యాయి. వారు ఇమేజ్‌ను బ్లర్ చేసేందుకు సీసీ కెమెరాపై బ్లాక్ పెయింట్‌ను స్ప్రే చేశారు. నగదు చెస్ట్‌ను తెరిచేందుకు దొంగలు గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగదును అపహరించి మారుతీ ఓమ్నీ వ్యాన్‌లో పరారయ్యారు. దొంగలు పక్కన ఉన్న మరో మెషీన్‌ని పగులగొట్టే ప్రయత్నం చేసినా అది తెరుచుకోకపోవడంతో దుండగులు వెనుదిరిగారు. ఆ మెషీన్‌లో రూ.40 లక్షల నగదు ఉంది.
తదుపరి విచారణ నిమిత్తం కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. చోరీ అనంతరం రెండు ఇనుప రాడ్‌లను వదిలివెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
Nalgonda : నల్డొండ ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ.. రూ.23 లక్షల అపహరణ

Crime