Revanth Reddy: ప్లీనరీలో పొత్తు మాట! రేవంత్ కు టీడీపీ ఆహ్వానం! టైమింగ్ అదుర్స్!

కాంగ్రెస్ , బీ ఆర్ ఎస్ పొత్తు తెరమీదకు వచ్చింది. అంతే కాదు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని తెలంగాణ టీడీపీ చీఫ్

  • Written By:
  • Updated On - February 27, 2023 / 02:21 PM IST

తెలంగాణతో సహా వివిధ రాష్ట్రాల్లో పొత్తులు ఉంటాయని ప్లీనరీ వేదికగా రాహుల్ గాంధీ ప్రకటిచారు. దీంతో కాంగ్రెస్ , బీ ఆర్ ఎస్ పొత్తు తెరమీదకు వచ్చింది. అంతే కాదు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని తెలంగాణ టీడీపీ చీఫ్ కసాని జ్ఞానేశ్వర్ పార్టీలోకి ఆహ్వానించారు. అంటే పొత్తు విషయంలో ఏదో సీరియస్ చర్చ కాంగ్రెస్ లో జరుగుతుందని అర్థం అవుతుంది. లౌకిక పార్టీలు గా కాంగ్రెస్ , బీ ఆర్ ఎస్ తెలంగాణలో ఉన్నాయని కోమటిరెడ్డి వేంకట రెడ్డి ఇటీవల చెప్పారు. ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని జోస్యం చెప్పారు. ఆయన కామెంట్స్ మీద తెలంగాణ నాయకులు కోప్పడ్డారు. కానీ, ఆయన చేసిన కమేంట్స్ కు అనుగుణంగా రాయపుర్ ప్లీనరీ తీర్మానం చేసింది. ఇలాంటి ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. ఏఐసీసీ చీఫ్ కూడా పొత్తు కోసం ప్రయత్నం అన్ని రాష్ట్రాల్లో చేసినట్టే తెలంగాణ లోను ఉంటుందని సంకేతం ఇచ్చారు. థర్డ్ ఫ్రంట్ అనేది మోడీకి మేలు చేస్తుందని పరోక్షం గా కేసీఆర్ ప్రయత్నాలను సోనియా ప్లీనరీ లో ప్రస్తావించారు. భవసారూప్యత ఉన్న పార్టీలను కలుపుకు పోవాలని ముఖ్త కంఠంతో ప్లీనరీ తీర్మానం చేసింది. ఆ తీర్మానం జరిగిన వెంటనే టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి పిలుపు రావటం గమనార్హం.

15 ఏళ్ల ప్రస్థానంలో టీ ఆర్ ఎస్ నుంచి టీడీపీ అక్కడనుంచి కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి మారారు. జడ్పీటీసీ గా ప్రత్యక్ష రాజకీయాలను ప్రారంభించి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ సీఎం కావాలని ఆయన లక్ష్యం. అంతే కాదు రెడ్డి సామాజిక వర్గానికి నాయకత్వంలోనే అన్ని పార్టీలు ఉండాలని ఆయన ఆలోచన. ఆయన పీసీసీ అయిన తరువాత కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని సీనియర్లు భావిస్తున్నారు. ఆ మేరకు అధిస్తానంకు రిపోర్ట్ కూడా చేశారు. అందుకు హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయాలని పాదయాత్ర రేవంత్ చేస్తున్నాడు. మధ్య తరగతి, హిందు ఓటు బాంకును ఆకట్టు కొనేలా ఆయన ప్రయత్నించారు. అయితే ప్లీనరీ వేదికగా తీసుకున్న రెండు నిర్ణయాలు ఆయన ప్రయత్నాన్ని బూడిదలో పోసిన పన్నీర్ లా చేసాయని సర్వత్రా వినిపిస్తుంది. తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో పొత్తు, అగ్ర వర్ణ పేదలకు మోడీ ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ దళితులకు, గిరిజనులకు కూడా షేర్ ఇస్తానని చెప్పటం పార్టీకి భారీ నష్టం కలిగిస్తుందని వినికిడి. అందుకే రేవంత్ రెడ్డి (Revanth Reddy) పునరాలోచనలో పడ్డారని తెలుస్తుంది. అందుకే టీడీపీ ఓపెన్ ఆఫర్ ఇచ్చిందని టాక్. కానీ ఆ పార్టీలోని చాలా మంది తిరిగి రేవంత్ ను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని తెలిసింది.

ప్లీనరీ తీర్మానాలను బీజేపీ అనుకూలంగా మలుచు కుంటుంది. ప్రత్యేకించి పొత్తు తీర్మానం తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పేలా బీజేపీ ప్రచారం చేస్తోంది. ఎన్నికల్లో పార్టీ గెలవదని కాంగ్రెస్ లోని సొంత పార్టీ వాళ్లకే బాగా తెలుసు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ కలుస్తాయని బీజేపీ చెబుతుంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఒకటేనని ప్రజలు బీజేపీని అధికారంలోకి తెస్తారని బండి సంజయ్‌ అన్నారు. ‘‘ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులందరూ బీఆర్‌ఎస్‌కు జంప్ అవుతారని బీజేపీ భావిస్తుంది. ప్రజలు కూడా అయోమయంలో ఉన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే, ఎన్నికల్లో గెలిచి బీఆర్‌ఎస్‌లోకి జంప్ అవుతారని బలంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. గ్రేటర్, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్ ప్రతినిధులు బీ ఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. అందుకే ప్రజలు కూడా బీజేపీ చేసే ఆరోపణలను నమ్ముతున్నారు. ఇక ఇప్పుడు రేవంత్రెడ్డి ని టీడీపీ ఆహ్వానించటం తెలంగాణ రాజకీయాల్లోని హాట్ టాపిక్. నిప్పు లేనిది పొగ రాదంటారు పెద్దలు. ఆ సామెత మాదిరిగా మళ్ళీ రేవంత్ టీడీపీ గూటికి చేరటానికి ఛాన్స్ ఉందని కొందరు నమ్ముతున్నారు. దానికి కారణం ప్లీనరీ తీర్మానాలుగా చెప్పుకుంటున్నారు.

Also Read:  Lakshmi Narayana: కాంగ్రెస్ లోకి లక్ష్మీ నారాయణ? రాయపూర్ ప్లీనరీ ఎఫెక్ట్!