Site icon HashtagU Telugu

Deputy CM: కేసీఆర్, కేటీఆర్, హరీష్ స‌ర్వేలో పాల్గొన‌లేదు ఎందుకు?: డిప్యూటీ సీఎం

Deputy CM

Deputy CM

Deputy CM: షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాల రూపకల్పన చేయడానికి ప్రభుత్వం కుటుంబ సర్వే సమాచారాన్ని ఉపయోగిస్తుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం (Deputy CM) భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం బీసీల సంఖ్య 56. 33 శాతం అని సమగ్ర ఇంటింటి సర్వే ద్వారా తేలింది. ఈ సంఖ్యల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, బడ్జెట్లో కేటాయింపులకు సర్వే సమాచారాన్ని వినియోగిస్తాం. సర్వే సమాచారం ఆధారంగా సమగ్రత, పారదర్శకత ప్రాతిపదికగా నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని ఈ సర్వే సూచిస్తుంది అని పేర్కొన్నారు.

ఇంకా మాట్లాడుతూ.. ఈ సర్వే సమాచారం ఆధారంగా రాబోయే రోజుల్లో చాలా చేయబోతున్నాం. ఈ సర్వే రాష్ట్రంలోని ప్రజల వివిధ రకాల స్థితిగతులపై ఫుల్ బాడీ చెకప్ ఒక ఎక్సరే లాంటిది. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్దతతో ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తుంది. రాష్ట్రంలో 3.56 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదు. ఇందులో కేసీఆర్, కేటీఆర్, హరీష్, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వారు ఉన్నారు. వారు ఇప్పుడు ఆసక్తి కనబరిచి సమాచారం ఇస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్నారు.

Also Read: Vikasith Bharat : పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు : ప్రధాని

బీఆర్ఎస్ నాయకులు సమగ్ర కుటుంబ సర్వే పేరిట ఒకేరోజు ఆరు గంటల్లో సర్వే పూర్తి చేశామని తెలిపారు.
మీరు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఏం చేసుకున్నారో.. ఎవరికీ తెలియదు. మీరు అధికారంగా చేసి ఉంటే సభలో పెట్టలేదు. బహిరంగంగా ప్రకటన చేయలేదు. కాబట్టి అది అధికారిక డాక్యుమెంట్ ఎలా అవుతుంది అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో కులగణనపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సైంటిఫిక్ సర్వే జరగలేదు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిదని చెప్పారు.

సర్వే ఆధారంగా రాష్ట్ర వనరులు సంపదను అభివృద్ధికి కావాల్సిన విధంగా వినియోగిస్తాం. రాజకీయ, విద్య, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన వారిని గుర్తించి ఆ వర్గాల ప్రగతికి వినియోగిస్తాం. బలహీన వర్గాలకు మేలు జరగాలన్న ఆలోచన ఉండదు కాబట్టి బీఆర్ఎస్ నాయకులకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే పై నమ్మకం ఉండదని పేర్కొన్నారు. సర్వే ఫారంలో మొత్తం 57 ప్రశ్నలు ఉండగా అదనపు, ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్ర‌శ్న‌ల‌కు సమాచారం సేక‌రించిన‌ట్లు తెలిపారు.

సర్వే నుంచి వచ్చిన ఫలితాలు

రాష్ట్రంలో 3, 54, 77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తంలో సామాజిక వర్గాల వారి సంఖ్య ఇలా ఉంది.