Site icon HashtagU Telugu

Jitta Arrest : బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అరెస్ట్ వెనుక అసలు కథ ఇది!

Jitta Arrest

Jitta Arrest

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం తారస్థాయికి చేరింది. బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం అర్థరాత్రి సమయంలో నాటకీయ పరిణామాల మధ్య ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆయన పోలీసులను ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు మాత్రం ఆయన మాటలను పట్టించుకోకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

జూన్ 2న ఉద్యమకారుల ఆకాంక్షల సాధన సభ జరిగింది. అందులో జిట్టా బాలకృష్ణారెడ్డి… కేసీఆర్ పై ఓ స్కిట్ ను వేశారని.. అది కేసీఆర్ ను కించపరిచేలా ఉందంటూ టీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను బలవంతంగా అరెస్ట్ చేసినట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తు్న్నారు. ఆయనను పది నిమిషాల్లో విడుదల చేయకపోతే తానే పోలీస్ స్టేషన్ కి వస్తానని ఓ దశలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గట్టిగానే హెచ్చరించారు. తరువాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

జిట్టాను తీసుకెళుతున్న పోలీస్ వాహనాన్ని.. ఆయన అనుచరులు మరో వాహనంలో ఫాలో అయ్యారు. దీనిని గమనించిన పోలీసులు.. వనస్థలిపురం పనామా గోడౌన్ వద్ద ఆ వాహనాన్ని అడ్డగించారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు.. రాచకొండ కమిషనరేట్ కు భారీగా వెళ్లడానికి సిద్ధపడినట్లు సమాచారం. ఓ దశలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

పరిస్థితులను గమనించిన తెలంగాణ డీజీపీ.. జిట్టా బాలకృష్ణారెడ్డికి 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి విడుదల చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.