Praja Sangram Yathra : బండి సంజయ్ 4వ విడత పాదయాత్ర షెడ్యూల్ ఇదే…!!

తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో బీజేపీ చకచక పావులు కదుపుతోంది. అధికార పార్టీకి ధీటుగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది.

  • Written By:
  • Publish Date - September 5, 2022 / 10:09 AM IST

తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో బీజేపీ చకచక పావులు కదుపుతోంది. అధికార పార్టీకి ధీటుగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే మూడు విడత పాదయాత్రతో గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలకు చేరువవుతున్నారు. ఇప్పుడు నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రతో మరోసారి జనాల్లోకి రాన్నున్నారు. దీనికి సంబంధిన షెడ్యూల్ ఖరారైంది. ఈ విడతలో పది రోజుల్లో 9 అసెంబ్లీ నియోజకవర్ాలు, 115.3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు సంజయ్. ఎంపీ బండి సంజయ్ చేపట్టనున్న నాలుగో విడత పాదయాత్ర మొత్తం పదిరోజుల పాట సాగనుంది.

నాలుగవ విడతలో భాగంగా మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 115 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించానున్నారు. ఇబ్రహీంపట్నంలోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఈ పాదయాత్రను భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ముగించనున్నారు.

ఇక ఈనెల 17 కేంద్రం హెంశాఖ మంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు బండి సంజయ్ పాదయాత్రకు విరామం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్ , ఉప్పల్ ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈసారి పాదయాత్రను మునుగోడు ఉపఎన్నికల ప్రచారమే లక్ష్యంగా సాగనుంది. అందుకే మునుగోడుకు కూతవేటు దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజవర్గంలో ముగింపు సభను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే ఈ సభకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు. మొత్తానికి తెలంగాణలో బీజేపీ తన హవా కొనసాగిస్తోంది.