Richest MP – Rajya Sabha : దేశంలోనే ధనిక ఎంపీ బండి పార్థసారథి.. సెకండ్ ప్లేస్ లో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి

Richest MP - Rajya Sabha : దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు, ఫార్మా దిగ్గజం బండి పార్థ సారథి నిలిచారు. ఆయన ఆస్తి విలువ దాదాపు రూ.5300 కోట్లు.

Published By: HashtagU Telugu Desk
Richest Mp Rajya Sabha

Richest Mp Rajya Sabha

Richest MP – Rajya Sabha : దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు, ఫార్మా దిగ్గజం బండి పార్థ సారథి నిలిచారు. ఆయన ఆస్తి విలువ దాదాపు రూ.5300 కోట్లు. ఈ కేటగిరిలో సెకండ్ ప్లేస్ లో వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు, వ్యాపారవేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి  నిలిచారు.  ఈయన ఆస్తి  విలువ రూ.2577 కోట్లు.  అసోసియేషన్ ఫర్ డెమొక్రట్రిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) సంస్థలు అధ్యయనం చేసి ఈ వివరాలతో ఒక నివేదికను విడుదల చేశాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఎంపీలు పేర్కొన్న వివరాల ప్రకారం ఈ సంస్థలు వీరి ఆస్తులను లెక్కించినట్టు సమాచారం. దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన రాజ్యసభ ఎంపీల్లో ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. 2018-19 నాటికి ఆయన వార్షిక ఆదాయం రూ.279 కోట్లు. రెండో ప్లేస్ లో ఉన్న బండి పార్థ సారథి వార్షిక ఆదాయం (2020-21) రూ.140 కోట్లు. మూడో ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ ఎంపీ, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వార్షిక ఆదాయం (2016-17) రూ.131 కోట్లు.

Also read : New Covid Variant: కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ ముప్పు తప్పదా..? డబ్ల్యూహెచ్ఓ అలర్ట్..!

ఈ నివేదిక ప్రకారం.. రాజ్యసభలో 12 శాతం మంది బిలియనీర్లు ఉన్నారు. అందులో తెలుగు వారి సంఖ్యే అధికంగా ఉందని (Richest MP – Rajya Sabha) తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది ఎంపీల ఆస్తుల మొత్తం విలువే 9,419 కోట్ల రూపాయల వరకు ఉందని ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యు పేర్కొన్నాయి. రాజ్యసభలో ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న 11 మంది రాజ్యసభ సభ్యులలో ఐదుగురు, అలాగే తెలంగాణ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న 7 మంది ఎంపీలలో ముగ్గురు శ్రీమంతులు (ఆస్తుల విలువ రూ.100 కోట్లు) ఉన్నారు. ఏపీ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న 11 మంది రాజ్యసభ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.3,823 కోట్లుగా ఉండగా.. తెలంగాణ నుండి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఏడుగురు ఎంపీల ఆస్తుల మొత్తం విలువ రూ.5,596 కోట్లకు లెక్క తేలింది.

Also read : AlBukhara Fruit : ఆల్‌బుకర పండ్లు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

  Last Updated: 19 Aug 2023, 07:22 AM IST