Site icon HashtagU Telugu

CLP Meeting : సీఎల్పీ సమావేశానికి ఆ ముగ్గురు రాకపోవడానికి కారణం..?

Clp Meeting

Clp Meeting

తాజాగా జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి (CLP Meeting) ముగ్గురు కీలక ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ లు సమావేశానికి డుమ్మా కొట్టడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న వీరు కేబినెట్ విస్తరణలో చోటు దక్కుతుందో లేదో అనే అనుమానంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

#ChatGPT ను ఇలా కూడా వాడతారా? నీ ఐడియా సూపర్ బాస్

ఈ ముగ్గురు నాయకులు గత కొన్ని రోజులుగా పార్టీపై పరోక్షంగా, ఒకోసారి బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపైనా విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. ఇదే సమయంలో సీఎం రేవంత్ సీఎల్పీ సమావేశంలో పదవుల విషయంపై వ్యాఖ్యానిస్తూ.. తాను కాకుండా పార్టీ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఎవరికైనా అభిప్రాయాలుంటే అవి పార్టీలోనే వ్యక్తపరచాలని, బహిరంగ విమర్శలు సబబుకావని హెచ్చరించారు.

ఇక ఈ ముగ్గురి చర్యపై పార్టీ వర్గాల్లో పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ ఆలస్యం కావడంతోనే అసంతృప్తి పెరిగిందని, ఇదే కారణంగా సీఎల్పీ మీటింగ్‌కు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే పార్టీలో అలకపాన్పు పై వీరిపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో, వారిని మళ్లీ ఎలా కట్టడి చేస్తుందన్నది ఇప్పుడు టీఆర్ఎస్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Exit mobile version