Rice Prices – 2024 : బియ్యం ధరలు భారీగా పెరగనున్నాయి. నవంబరులో కురిసిన వర్షాల ఎఫెక్టుతో తెలంగాణలో ఖరీఫ్‌లో పంట నష్టం భారీగా జరిగింది. మిగ్ జామ్ తుఫాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, గోదావరి జిల్లాల్లో లక్షల ఎకరాలలో వరి పంట దెబ్బతింది. ఈనేపథ్యంలో 2024 జనవరి నెలాఖరుకల్లా బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత నెలలో రూ.1400గా ఉన్న 26 కిలోల బియ్యం బస్తా ధర ప్రస్తుతం రూ.1550-1600కు చేరింది. ఇక నుంచి ప్రతి వారం బియ్యం ధరలు పెరుగుతాయని, జనవరి నెలాఖరుకు 26 కిలోల బియ్యం బస్తా ధర రూ.2వేలకు చేరొచ్చని హోల్ సేల్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే రబీ పంటపై ఆధారపడి.. బియ్యం ధరలు ఎలా ఉంటాయనేది డిసైడ్ అవుతుందని అంటున్నారు. రబీలో కూడా వరి పంట సరిగ్గా మార్కెట్లోకి రాకపోతే ఈ ఏడాది జనానికి గడ్డు పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బ్రాండెండ్ రకం సన్న బియ్యం ధర కిలోకు రూ.62 వరకు ఉంది. మరో వారం పదిరోజుల్లో ఈ ధర రూ.70కు చేరుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత మరో 5 రూపాయలకు అటుఇటుగా పెరిగి బస్తా రూ.2వేల వద్ద స్థిరపడుతుందని అంచనా వేస్తున్నారు. బియ్యం, పప్పు ధాన్యాల వంటి వస్తువుల ధరలపై గతంలో పౌరసరఫరాల శాఖల ఆజమాయిషీ ఉండేది. ఒక్క సీజన్‌లో పంట నష్టం జరిగితే అమాంతం ధరలు పెంచేస్తున్నా వాటిని నియంత్రించే చర్యలు మాత్రం ప్రభుత్వం వైపు నుంచి కొరవడుతున్నాయి. దీంతో మిల్లర్లు నిర్ణయించిందే ధర(Rice Prices – 2024) అవుతోంది.
Also Read: TTD : తిరుమల శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో లలిత బ్రాండ్ 26 కిలోల బస్తా ఈ నెల మొదటి వారంలో రూ.1,470 ఉండేది. ఇప్పుడు అది రూ.1,550కు చేరింది. అలాగే అమూల్ బ్రాండ్ బియ్యం బస్తా రూ.1400 నుంచి రూ.1450కి, కల్యాణి రూ.1270 నుంచి రూ.1350కి, బెల్ బ్రాండ్ రూ. 1400 నుంచి రూ.1520కి చేరింది. ఈ రేటు ఇంకా పెరుగుతుందని మిల్లర్లు భయపెడుతున్నారు. అడ్డగోలుగా బియ్యం ధరలు పెంచుతున్న మిల్లర్లపై విజిలెన్స్ దాడులు చేయించాలని కూడా రిటైల్ వ్యాపారులే సూచిస్తున్నారు. గత పదేళ్ల కాలంలో ఒకేసారి అంటే వారం రోజుల్లో ఒక్కసారిగా బియ్యం ధరలు పెరగడం తాము ఎప్పుడూ చూడలేదని స్థానికులు అంటున్నారు.