Chicken Price : చుక్కలు చూపిస్తున్న చికెన్ రేట్లు.. ఎందుకు ?

ఎండలు ఎలా మండిపోతున్నాయో.. చికెన్  రేట్లు కూడా అలాగే చుక్కలు చూపిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - May 20, 2024 / 09:20 AM IST

Chicken Price : ఎండలు ఎలా మండిపోతున్నాయో.. చికెన్  రేట్లు కూడా అలాగే చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందటి వరకు కేజీకి రూ.260 పలికిన చికెన్ రేటు.. ఇప్పుడు రూ.300 దాటింది. సమ్మర్ టైం కావడంతో కోళ్ల దిగుబడి తగ్గింది. దీంతో రేట్లను పెంచి విక్రయాలు జరుపుతున్నారు. ప్రస్తుతం కేజీ కోడి రేటు దాదాపు రూ. 165 దాకా ఉంది. ఇక ఇదే సమయంలో  స్కిన్‌తో చికెన్ రేటు రూ.290 ఉండగా..  స్కిన్‌ లేకుండా చికెన్ రేటు రూ.310 దాకా చేరింది.

We’re now on WhatsApp. Click to Join

కొన్ని ప్రాంతాల్లో కోళ్ల లభ్యత ఆధారంగా చికెన్ రేటు పది రూపాయలు అటుఇటుగా ఉంది.  ఈ పరిణామంతో చికెన్ విక్రయాలు బాగా తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో సగటున రోజుకు 100 కేజీల చికెన్ విక్రయించిన వ్యాపారులు.. ఇప్పుడు 70 కేజీలే విక్రయించగలుగుతున్నారు. ఇక  కోడిగుడ్డు ధర రూ. 6గా ఉంది. దీని రేటు కూడా రూ.5కుపైనే ఉండటంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.

Also Read : Hema – Rave Party : బెంగళూరులో రేవ్ పార్టీ.. దొరికిపోయిన యాక్టర్ హేమ

మచ్చుకు పరిశీలిస్తే.. ప్రకాశం జిల్లాకు నెల్లూరు, చిలకలూరిపేట, గుంటూరు నుంచి ఎక్కువగా కోళ్లు దిగుమతి అయ్యేవి. ప్రస్తు తం అక్కడి నుంచి సరఫరా తగ్గిపోయింది. దీంతో రాజమండ్రి, విజయవాడ నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో రవాణా ఖర్చులు బాగా పెరిగాయి. ఇది కూడా చికెన్ రేట్ల పెరుగుదలకు ఒక కారణం. మరో పక్షం రోజులు చికెన్ ధరలది  ఇదే పరిస్థితి అని.. రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read :Iran President: హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి మృతి!

గతంలోకి వెళితే.. ఈ ఏడాది జనవరిలో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. అప్పుడు చికెన్ రేటు కిలోకు రూ.130 నుంచి రూ.140 రేంజులో ఉండేది. ఆ సమయంలో కోళ్ల ఫాంల యజమానులకు నష్టాలే మిగిలాయి. దీంతో కోళ్ల పెంపకాన్ని పూర్తిగా తగ్గించారు. ఈ ఎఫెక్టుతో ఏప్రిల్ నెల నాటికి కిలో చికెన్ ధర రూ. 280కి చేరింది. ఇప్పుడది రూ.310 అయింది. దీంతో చికెన్ కన్నా గుడ్లు వండుకోవడం బెటర్ అని జనాలు అనుకుంటున్నారు.

Also Read : Abhishek Sharma creates history : చ‌రిత్ర సృష్టించిన అభిషేక్ శ‌ర్మ‌.. కోహ్లి రికార్డు బ‌ద్ద‌లు