Operation BRS : ఆట షురూ.. ‘ఆపరేషన్ బీఆర్ఎస్’ మొదలుపెట్టిన సీఎం రేవంత్

Operation BRS : పొలిటికల్ జంపింగ్స్ గేమ్ నాడు బీఆర్ఎస్ ఆడింది.. నేడు కాంగ్రెస్ ఆడుతోంది.

  • Written By:
  • Updated On - February 16, 2024 / 11:34 AM IST

Operation BRS : పొలిటికల్ జంపింగ్స్ గేమ్ నాడు బీఆర్ఎస్ ఆడింది.. నేడు కాంగ్రెస్ ఆడుతోంది. ఆనాడు మొత్తం కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయించేలా దూకుడుతో హస్తం పార్టీ కీలక నేతలందరినీ కేసీఆర్ తన వైపునకు లాక్కున్నారు. ఆ విధంగా ఇతర పార్టీల లీడర్లందరినీ లాక్కోవడమే దీర్ఘకాలంలో బీఆర్ఎస్‌కు మైనస్ పాయింట్‌గా మారింది. పార్టీలో సీనియర్లకు కాకుండా మధ్యలో జంపింగ్స్ చేసి వచ్చినవారికే ప్రయారిటీ దక్కడం అసలుకే ఎసరు తెచ్చింది. ఈనేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ ‘ఆపరేషన్ బీఆర్ఎస్’ను మొదులపెట్టారు. కారు పార్టీ ముఖ్య నేతలపై గురిపెట్టారు. ఇప్పటికే కొందరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్‌తో భేటీ అయ్యారు.  తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ హోదాలోనూ ఉన్న సీఎం రేవంత్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలవడమే లక్ష్యంగా ఈ చేరికలను ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న  లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ కీలక నేతలను ఆకర్షించడంపై సీఎం ఫోకస్ పెట్టారట. ఇప్పటికే కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు పూర్తయిందని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

ఇవాళ వీరంతా కాంగ్రెస్‌లోకి

ఇందులో భాగంగానే తాజాగా  శుక్రవారం ఉదయం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డి ఆ పార్టీకి  రాజీనామా చేశారు. ఇవాళే గులాబీ పార్టీ నుంచి మరో నలుగురు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,  బొంతు రామ్మోహన్‌ సతీమణి బొంతు శ్రీదేవి,  మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి కాంగ్రెస్‌లో జాయిన్ కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

Also Read : Credit Card : ‘క్రెడిట్ కార్డు’ పోయిందా ఇలా చేయండి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై పట్టు కోసం..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై బీఆర్ఎస్‌కు ఇప్పటికీ మంచి పట్టు ఉంది. దీంతో అలర్ట్ అయిన సీఎం రేవంత్ .. అక్కడ గులాబీ పార్టీని దెబ్బ తీసే వ్యూహాలను అమలు చేస్తున్నారు. దీని ఫలితంగానే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్‌లో చేరనుంది.  వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సమయంలోనే చేవెళ్ల ఎంపీ టికెట్‌‌పై హామీ ఇచ్చారు. ఈ రోజు సునీతారెడ్డి, కుమారుడు రినీష్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారు. సునీతారెడ్డి వరుసగా మూడోసారి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా పనిచేయగా, ప్రస్తుతం వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌గా ఆమె కొనసాగుతున్నారు.

Follow us