The police have been moving BRS leaders in buses since two hours : హైదరాబాద్లోని సైబరాబాద్ సీపీ ఆఫీస్ (CP Office) వద్ద నిరసనకు దిగిన మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సహా పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ (Arrest) చేసిన పోలీసులు..రెండు గంటల నుండి వారిని బస్సులోనే తిప్పుతూ ఉన్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని.. బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ఫై దాడి చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఫై FIR చేయాలనీ హరీష్ రావు , కౌశిక్ రెడ్డి లు కోరారు. అయితే పోలీసులు మాత్రం FIR చేయకకపోవడం తో సీపీ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు.
అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరినా వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. అక్కడి నుండి ఎటు తీసుకెళ్తున్నారో చెప్పకుండా రెండు గంటలనుండి అటు ఇటు తిప్పుతున్నారు. హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు ఉన్న వాహనాన్ని శ్రీశైలం రోడ్డుపైపు మళ్లించారు. కడ్తాల్ మీదుగా కల్వకుర్తికి తరలిస్తున్నట్లు తెలుస్తున్నది. రెండుగంటలుగా బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు రోడ్లపైనే తిప్పుతున్నారు. ఇప్పటికే వంద కిలోమీటర్లకుపైగా వాహనాల్లో తిప్పారు. ఓ వాహనాన్ని తలకొండపల్లి, మరొకటి కేశంపేట వైపు తిప్పారు. తలకొండపల్లి వద్ద ఎమ్మెల్యేలను తరలిస్తున్న వాహనాన్ని బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. కేశంపేట మండలం కొత్తపేట వద్ద వాహనానికి అడ్డుగా బీఆర్‌ఎస్ శ్రేణులు భైఠాయించాయి. కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.
పోలీసుల తీరుపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏసీపీ, సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే మమ్మల్ని అరెస్టు చేశారని ఆరోపించారు. అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో తిప్పుతున్నారన్నారు. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదన్నారు. మేం ఏమైనా ఉగ్రవాదులమా? అంటూ ప్రశ్నించారు. మాజీ మంత్రినైనా తనతో ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. నా ఎడమ భుజం బాగా నొప్పి వస్తుందన్నారు. పోలీసులు నా చేతిని బలంగా లాగడంతో నొప్పి పెరిగిందన్నారు.
Read Also : PM Modi : వామపక్షాలకు ఆయనొక దారిదీపం: ఏచూరి మృతి పట్ల ప్రధాని విచారం