Site icon HashtagU Telugu

KTR Tweet: రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు,  జంప్‌ జిలానీలపై కేటీఆర్ ట్వీట్

KCR Deeksha

KCR Deeksha

KTR Tweet: అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆరఎస్ పార్టీ గడ్డు కాలం ఎదుర్కొంటుంది. ఒకవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు కవిత అరెస్ట్, కీలక నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తుండటం ఏమాత్రం జీర్ణించుకొలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులపై తాజాగా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు కేకే, కడియం శ్రీహరి, హైదరాబాద్ మేయర్, కడియం శ్రీహరి లాంటి కాంగ్రెస్ లో చేరుతున్న విషయాలపై ఆయన పరోక్షంగా స్పందించారు

‘‘శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్ ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్ ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు’’ అని ట్వీట్ చేశారు.

‘‘ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR ను, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం’’ ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు.