New Academic Calendar : అకడమిక్‌ క్యాలెండర్‌ వచ్చేసింది.. దసరా, సంక్రాంతి సెలవుల వివరాలివీ

తెలంగాణలో స్కూళ్లు జూన్‌ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. 

  • Written By:
  • Updated On - May 25, 2024 / 02:56 PM IST

New Academic Calendar : తెలంగాణలో స్కూళ్లు జూన్‌ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.  ఈ నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరానికి (2024-25) సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర విద్యా శాఖ రిలీజ్ చేసింది. దీని ప్రకారం వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు 229 రోజులు పనిచేయనున్నాయి. స్కూళ్లు జూన్‌ 12 నుంచి ఏప్రిల్‌ 24 వరకు పనిచేయనున్నాయి. 2025 ఏప్రిల్‌ 24 నుంచి 2025 జూన్‌ 11 వరకు 49 రోజుల పాటు వేసవి సెలవులు ఉంటాయి. ఈ ఏడాది దసరాకు అక్టోబర్ 13 నుంచి 25 వరకు అంటే 13 రోజులపాటు సెలవులు ఉంటాయి. డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు ఇస్తారు. 2025 జనవరి 12 నుంచి 17 వరకు ఆరు రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉంటాయి.

We’re now on WhatsApp. Click to Join

  • 2025 జనవరి 10 వరకు టెన్త్ క్లాస్ సిలబస్‌ను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ఉపాధ్యాయులకు నిర్దేశించనున్నారు.
  • పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షలను 28 ఫిబ్రవరి 2025లోపు నిర్వహిస్తారు.
  • పదో తరగతి బోర్డు పరీక్షలను 2025 మార్చిలో నిర్వహించనున్నారు.
  • పదో తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ ను రెండు నెలల ముందు విద్యా శాఖ(New Academic Calendar) వెల్లడించనుంది.
  • 2025  ఫిబ్రవరి 28 వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి సిలబస్ పూర్తి చేయనున్నారు.
  • ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి రోజు ఐదు నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉంటాయి.
  • హైస్కూళ్లకు తరగతులను రోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నిర్వహిస్తారు.
  • అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లకు తరగతులను రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 వరకు నిర్వహిస్తారు.
  • ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-1 ఎగ్జామ్స్ ను ఈ ఏడాది జూలై 31 లోగా, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-2 పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 లోగా, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (SA)-1 పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 28 వరకు, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-3 పరీక్షలను డిసెంబర్‌ 12 లోపు నిర్వహిస్తారు.
  •  ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-4 పరీక్షలను 2025 జనవరి 29 లోపు, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (SA)-2 పరీక్షలను 2025 ఏప్రిల్‌ 9 నుంచి ఏప్రిల్‌ 29 వరకు (1 నుంచి 9 తరగతులకు) నిర్వహించనున్నారు.

Also Read : Europe Tour: 4-2తో బెల్జియంను ఓడించిన భారత జూనియర్ మహిళల హాకీ జట్టు