Site icon HashtagU Telugu

KCR New Party: కేసీఆర్ జాతీయ పార్టీకి ఆ పేరు ఫైనల్..?

Kcr Imresizer

Kcr Imresizer

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్త పార్టీ ప్రకటనపై ముహుర్తం కూడా ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 5 దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని పలువురు ముఖ్యమంత్రులు, సామాజికవేత్తలతో కేసీఆర్ జాతీయ పార్టీపై చర్చించారు. అయితే జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ను ప్రకటించాలన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం కొత్త పార్టీ వైపే ఇంట్రెస్టు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇవాళ మంత్రులు, జిల్లా అధ్యక్షులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ లో భేటీ కానున్నారు. ఈ భేటీలో కొత్త పార్టీ జెండా, అజెండాపై ప్రధానం చర్చ జరగనుంది. దసరా కంటే ముందుగానే పార్టీ ముఖ్యనేలతో భేటీ నిర్వహించి దసరా రోజే పార్టీ ప్రకటించాలని కేసీఆఱ్ నిర్ణయిం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక జాతీయ పార్టీకి భారతీయ రాష్ట్ర సమితి (BRS), భారతీయ వికాస సమితి, నయా భారత్ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయట. అయితే టీఆర్ఎస్ ను పోలి ఉన్న బీఆర్ఎస్ వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దాదాపు ఇదే పేరు ఫైనల్ కానున్నట్లు సమాచారం. పార్టీ జెండా, గుర్తు విషయంలోనూ ఓ నిర్ణయం తీసుకున్నారట. . జాతీయ పార్టీకి కూడా కారు గుర్తునే ఉండనున్నట్లు తెలుస్తోంది . . జెండా విషయంలోనూ గులాబీ రంగే ఉండబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version