తెలంగాణ సీఎం (Telangana CM) ఎంపికపై కాంగ్రెస్ పార్టీలో తర్జనభర్జనలు నడుస్తూనే ఉన్నాయి. సీఎం పదవి కోసం ఎక్కువ మంది ఆశిస్తుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం నుంచి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నది. తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) నివాసంలో కాంగ్రెస్ కీలక నేతలు సమావేశమయ్యారు. కొద్దీ సేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది. ఉత్తమ్ (Uttam) , భట్టి (Bhatti) లతో విడివిడిగా చర్చలు జరిపారు. దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ప్రస్తుతం రాహుల్ (Rahul) బయటకు వచ్చినప్పటికీ ఇంకా ఖర్గే నివాసంలో డీకే తో పాటు పలువురు ఉన్నారు. ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ, జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించిన డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మానిక్‌రావు థాక్రే ఈ సమావేశంలో పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
సీఎం పదవి కోసం రేవంత్ రెడ్డితోపాటు సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రామార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి పోటీ పడుతున్నారు. దాంతో సోమవారం రాత్రి 8 గంటలకే జరుగుతుందనుకున్న సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఆగిపోయింది. ముగ్గురిలో ఒకరి పేరును ఖరారు చేయడం కోసం హైకమాండ్ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో విడివిడిగా సమావేశమైన డీకే.. ఇప్పుడు ఖర్గేతో భేటీయై నివేదికను సమర్పించారు. రేవంత్‌రెడ్డి వైపే మొగ్గుచూపుతున్న హైకమాండ్ ఈ సమావేశంలో చర్చ అనంతరం ఆయననే సీఎంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు డిప్యూటీ సీఎం విషయంలో మల్లు భట్టి విక్రమార్క సైతం కొన్ని షరతులు విధించడంతో దానిపై కూడా ఆయనను కన్విన్స్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఇలాంటి భిన్నాభిప్రాయాలు, అలకలు, కోరికలు చాలా సహజమని, ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం కాదని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలకు జరిగాయని, ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం ఏర్పడిందా అని ప్రశ్నించారు. బీజేపీ గెలిచిన మూడు రాష్ట్రాల్లో సైతం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరో తెలియలేదని, ఆ పార్టీకీ దానికుండే కష్టాలు ఉంటాయని, ఇవి పరిష్కారం లేని సమస్యలు కావని, సంక్షోభం అంతకంటే కాదన్నారు.
Read Also : KTR: రేపు రాష్ట్రవ్యాప్తంగా జనగామ జడ్పీఛైర్మన్ సంపత్‌రెడ్డికి నివాళులు అర్పించాలి – కేటీఆర్