Site icon HashtagU Telugu

Telangana Love All: తెలంగాణ ప్రజల ప్రేమ గొప్పది.. తెలంగాణ అందరినీ ప్రేమిస్తది..

The Love Of Telangana People Is Great.. Telangana Loves Everyone..

The Love Of Telangana People Is Great.. Telangana Loves Everyone..

700 ఏళ్ల క్రితం నిర్మించిన గణపసముద్రం, వనపర్తి రాజులు నిర్మించిన గోపాల సముద్రాన్ని పునరుద్దరిస్తున్నాం. వందల ఏళ్లు గుర్తుండుపోయే పనులు చేపట్టాం .. ఇవి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో శాశ్వతంగా నిలిచిపోయే అభివృద్ధి చేశాం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వనపర్తి నియోజకవర్గంలో 70 వేల ఎకరాలకు సాగునీరు అందించిన తర్వాతనే గత ఎన్నికల్లో నామినేషన్ వేశాను. పెద్ద ఎత్తున చెక్ డ్యాంల నిర్మాణం పూర్తిచేశాం. గ్రామాలు, తండాలకు సీసీ, బీటీ రహదారులను నిర్మించాం. రాష్ట్రంలో అత్యంత ఎక్కువగా సీసీ రహాదారులు వేసిన నియోజకవర్గం వనపర్తి. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో కరంటు, సాగునీరు, గురుకులాలు, రైతుబంధు, రైతుభీమా, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి పథకాలు ఎందుకు లేవు. అన్నీ ఇచ్చిన కేసీఆర్ అగ్గువకు దొరికాడని విపక్షాలు కారుకూతలు కూస్తున్నాయ్ ఖబర్దార్. వనపర్తిలో దేశంలోనే మొదటిసారి బాలికల గురుకుల వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేశాం.

దేశంలో 46 లక్షల కుటుంబాలకు ఆసరా ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ (Telangana), ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. సామాన్యులు సంతోషంగా బతకాలన్నదే ప్రభుత్వ అలోచన. వ్యవసాయం రంగమే ఉపాధిగా ఆధారపడిన 2.40 కోట్ల ప్రజల కోసం సాగునీరు, ఉచిత కరంటు, రైతుభీమా, రైతుబంధు పథకాలతో ఆత్మవిశ్వాసం నింపిన ప్రభుత్వం తెలంగాణ. ఈ రోజు తెలంగాణ (Telangana) సాధించిన విజయాలకు కేసీఆర్ పట్టుదల, చిత్తశుద్ది కారణం. నీళ్లు, కరంటు, మౌళిక వసతుల కల్పనకు దాదాపు 80, 90 శాతం ఖర్చు చేయడం జరిగింది. మిగిలిన రంగాల మీద ఇక నుండి ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. రాబోయే రోజులలో ప్రజలందరికీ ఉపాధి లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతాం. ఇప్పటి వరకు నియోజకవర్గంలో మూడువేల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది .. మరే మూడు వేల ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం. అర్హులకు దశలవారీగా డబల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తాం. ఇప్పటి వరకు సమాజం అభ్యున్నతి కోసం కష్టపడ్డాం.. ఇప్పటి నుండి పేద వర్గాల అభ్యున్నతి కోసం కష్టపడతాం.

వచ్చే వానాకాలం తర్వాత సాగునీరు కొరత అనే మాట ఉండదు. చేతికి శస్త్రచికిత్స జరిగి వైద్యులు 45 రోజులు విశ్రాంతి తీసుకోమన్నా కేవలం మూడు రోజులే విశ్రాంతి తీసుకున్నాను. ఓట్ల కోసం, సీట్ల కోసం తెలంగాణ (Telangana) సాధించలేదు. తెలంగాణ రాష్ట్రం మన అస్థిత్వం దానిని సాధించడం లక్ష్యంగా కష్టపడ్డాం. కేసీఆర్ నాయకత్వంలో చైతన్యవంతమయిన సమాజం నిర్మాణమయింది. ప్రజల సంతోషం, సమాజ సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తాను. కానాయపల్లి నుండి పెద్దమందడి చెరువుకు లిఫ్ట్‌ను ఏర్పాటు చేస్తాం.

వేలాదిగా తరలివచ్చి ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు. వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామం గోపాల సముద్రం వద్ద నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన పార్టీ జిల్లా ఇంచార్జ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ గారు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, జడ్పీటీసీలు రఘుపతిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మండల వైస్ ప్రెసిడెంట్ రఘుప్రసాద్ , మండల బీఆర్ఎస్ అధ్యక్షులు వేణు యాదవ్, మండల రైతుబంధు సమితి అధ్యక్షులు రాజాప్రకాష్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు.

ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు వ్యాఖ్యలు..

  1. తెలంగాణ రాష్ట్రం దేశంలోని మిగతా రాష్ట్రాలకు భిన్నంగా అభివృద్ధిలో ముందంజ వేసింది.
  2. కరంటు, సాగునీరు పుష్కలంగా ఉన్నది.
  3. తెలంగాణ గడపగడపకూ తాగునీరు అందించగలుగుతున్నాం.
  4. గత ప్రభుత్వాలు ఎందుకు తాగునీరు అందించలేకపోయాయి.
  5. నాడు వలసెల్లిన పాలమూరుకు ఇతర రాష్ట్రాల కూలీలు వలసవస్తున్నారు.
  6. తాగునీళ్లు, సాగునీళ్లు, కరంటు పంచాయతీలు తెలంగాణలో లేవు.
  7. గత ప్రభుత్వాల్లో అన్నింటికీ ఆందోళనలే.
  8. రైతుబంధు, రైతుభీమా పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి.
  9. వనపర్తి, పాలమూరు బిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో ఆనందంగా ఉన్నారు.
  10. 75 ఏళ్లు నష్టపోయిన తెలంగాణ నేడు సుభిక్షమవుతున్నది.
  11. వనపర్తి జిల్లా అయింది .. ఎంతో అభివృద్ధి చెందుతున్నది.
  12. దేశంలో ఇంత అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరూ లేరు.
  13. పచ్చని తెలంగాణ మీద నిప్పులు కురిపిస్తున్న వారిని ప్రజలు గమనించాలి .. వారి కుట్రలను తిప్పికొట్టాలి.
  14. అభివృద్ధి చేస్తున్న పార్టీని, నేతలను ప్రజలు ఆశీర్వదించాలి.

Also Read:  ED vs Kavitha: కవితకు ఈడీ నోటీసులు, రేపు మళ్లీ విచారణ