Site icon HashtagU Telugu

Revanth Reddy: దొరల రాజ్యం పోయి రైతుల రాజ్యం రావాలి: రేవంత్ రెడ్డి

Congress list

Revanth Reddy: మంగళవారం ఢిల్లీలో తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ విగ్రహం ముందు వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఆందోళనకు దిగారు.  వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో రాజకీయ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. దొరల పాలనలో రైతులకు మిగిలింది ఏమీ లేదన్నారు. దొరల రాజ్యం పోయి రైతుల రాజ్యం రావాలన్నారు.

కేసీఆర్ రైతు హంతకుడని.. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. తెలంగాణ ప్రజలు కన్నీటి కష్టాలతో సాయం కోసం ఎదురు చూస్తుంటే… మోరంచిపల్లి లాంటి గ్రామాలను కనీసం ఏరియల్ వ్యూలో కూడా కన్నెత్తి చూడని కేసీఆర్ రాజకీయ కాంక్షతో  ప్రత్యేక విమానాల్లో మహారాష్ట్రకు ఊరేగడాన్ని ఎంతవరకు సమంజసమని రేవంత్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు.