Formula E Race Case : ఫార్ములా ఈ-కారు రేసు కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. ఈ కేసులో ఇవాళ పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జనవరి 7న కేటీఆర్‌ను.. జనవరి 2,3 తేదీల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలను ఈడీ ప్రశ్నించింది. వారికి ఇప్పటికే ఈడీ సమన్లు పంపింది. మరో కొత్త అప్‌డేట్ ఏమిటంటే.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఏసీబీ అధికారులు ఈడీకి అందజేశారు. ఫార్ములా ఈ-కార్ రేసు ఒప్పందాలతో ముడిపడిన ఆర్థిక శాఖ రికార్డ్స్, హెచ్‌ఎండీఏ చెల్లింపుల వివరాలు, హెచ్‌ఎండీఏ చేసుకున్న ఒప్పంద పత్రాలు, ఎఫ్‌ఐఆర్ కాపీని ఈడీకి ఏసీబీ అప్పగించింది.
Also Read :Manmohan Friend : పాకిస్తానీ ఫ్రెండ్ రజాతో మన్మోహన్ కలిసిన వేళ..
ఏసీబీ అప్పగించిన డాక్యుమెంట్లలోని అంశాల ఆధారంగా కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్‌ఎల్ రెడ్డిలను అడిగేందుకు ప్రశ్నలను ఈడీ(Formula E Race Case) అధికారులు ప్రిపేర్ చేసే అవకాశం ఉంది. బ్యాంకు లావాదేవీలలోని మనీలాండరింగ్ కోణం, ఫెమా నిబంధనలను ఉల్లంఘించిన కోణంలలో ఈడీ ప్రశ్నలు ఉంటాయనే అంచనాలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఫార్ములా ఈ రేస్‌ను నిర్వహించే విదేశీ కంపెనీకి రూ.55 కోట్లను చెల్లించాలని కేటీఆర్ ఒత్తిడి చేశారనే అభియోగాలను తెలంగాణ ఏసీబీ నమోదు చేసింది. ఈవిషయంలో కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్‌ఎల్ రెడ్డిలకు ఒకే విధమైన ప్రశ్నలు అడిగి.. ఏ విధమైన సమాధానాలు వస్తాయనేది నోట్ చేసి పోల్చి చూసే ఛాన్స్ ఉంది. వారు ముగ్గురు ఇచ్చే సమాధానాల్లో ఉండే తేడాల ఆధారంగా తదుపరి ప్రశ్నలను ఫ్రేమ్ చేసి.. నిజానిజాలతో వారితోనే చెప్పించనున్నారు.
Also Read :Fake IPS Officer : పవన్ కళ్యాణ్ పర్యటనలో ఫేక్ ఐపీఎస్.. ఏపీ హోం మంత్రి సీరియస్
ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ ఆలస్యం అయినందున ఫార్ములా ఈ కారు రేస్ కేసును కొట్టివేయాలంటూ ఇటీవలే తెలంగాణ హైకోర్టును కేటీఆర్ కోరారు. అయితే తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే కేసును పెట్టొచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయన్న విషయాన్ని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేసింది.