Site icon HashtagU Telugu

Sex Racket: అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టురట్టు!

Cyberabad police sex racket

Cyberabad Imresizer

వ్యభిచార దందాలో 14,190 మంది అమ్మాయిలు చిక్కుకున్నట్టు cyberabad police గుర్తించారు. పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలు, ఉద్యోగాల కోసం వెతుకుతున్న అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి దించేవారని పోలీసులు తెలిపారు. వాట్సాప్ గ్రూపులు, వెబ్ సైట్, కాల్ సెంటర్లు, వాణిజ్య ప్రకటనల ద్వారా విటులను ఆకర్షించేవారని వివరించారు.

ఒక్క హైదరాబాదులోనే 950 మంది అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. 17 మందితో కూడిన ఈ ముఠాను (sex rocket)అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితుల నుంచి 3 కార్లు, 34 సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, రెండున్నర గ్రాముల ఎండీఎంఏ మత్తుపదార్థం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

ఈ కేసులో అర్ణవ్ అనే వ్యక్తి కీలక నిందితుడని, అతడిని సోమాజిగూడలో అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఏపీలో అనంతపురం నుంచి, తెలంగాణలో కరీంనగర్ నుంచి ఈ దందా నడిపిస్తున్నారని వివరించారు.

https://twitter.com/cyberabadpolice/status/1600116377968611330