Site icon HashtagU Telugu

Singareni Elections : సింగరేణి ఎలక్షన్స్ కు హైకోర్టు బ్రేక్.. డిసెంబరు 27 వరకు వాయిదా

Singareni

Singareni

Singareni Elections :  తెలంగాణలో సింగరేణి ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. డిసెంబర్ 27 వరకు ఎన్నికలను వాయిదా వేయాలని ఆదేశించింది. వాస్తవానికి ఈ నెల 28న సింగరేణి లో ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధమైంది. ఈమేరకు కేంద్ర డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ  ఎన్నికలపై సింగరేణి యాజమాన్యం, 13 కార్మిక సంఘాలు హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాయి. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని కోరాయి.

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణలో సింగరేణి ఎన్నికల్లో రాష్ట్రంలోని 6 జిల్లాల పరిధిలోని 43 వేల మంది కార్మికులు ఓటు వేస్తారు. ఇందుకోసం దాదాపు 700 మంది ఎలక్షన్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ పోల్స్ నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బందిని సింగరేణి పోల్స్ కోసం కేటాయించడం సాధ్యమయ్యే విషయం కాదని కోర్టులో రాష్ట్ర సర్కారు వాదన వినిపించింది. ఈ పిటిషన్ ను బుధవారం విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వలోని ధర్మాసనం బెంచ్.. డిసెంబరు 27 వరకు సింగరేణి పోల్స్ ను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. సింగరేణి పోల్స్ కోసం నవంబరు 30లోగా ఓటర్ లిస్ట్ ను తయారు చేయాలని (Singareni Elections) సూచించింది.

Also read : Most Wanted Terrorist : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మర్డర్.. ఎలా ? ఎక్కడ ?