MLAs Case: దర్యాప్తు వివరాలు ఎలా బహిర్గతం చేస్తారు..? సిట్ పరిధి ధాటి ప్రవర్తించిందన్న హైకోర్టు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మొత్తానికి సీబీఐకు చేరింది. రెండు రోజుల క్రితం సింగిల్ బెంచ్ హైకోర్ట్‌ తీర్పు మేరకు ఆర్డర్ కాపీ రిలీజైంది.

  • Written By:
  • Publish Date - December 28, 2022 / 11:03 PM IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మొత్తానికి సీబీఐకు చేరింది. రెండు రోజుల క్రితం సింగిల్ బెంచ్ హైకోర్ట్‌ తీర్పు మేరకు ఆర్డర్ కాపీ రిలీజైంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ విచారణ సరిగ్గా జరగలేదని ఆర్డర్ కాపీలో పేర్కొన హైకోర్టు.. సిట్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఇటీవల ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ తీర్పునిచ్చిన హైకోర్టు.. తీర్పు కాపీలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికీ తప్పే అని స్పష్టం చేసిన హైకోర్టు.. 26 కేసుల బడ్జిమెంట్లను కోట్ చేస్తూ తీర్పు ఇచ్చింది. సీబీఐకి ఇవ్వడానికి 45 అంశాలను చూపిస్తూ హైకోర్టు తన తీర్పును వెలువరించింది.
సిట్ ఇన్వెస్టిగేషన్ ఫేర్‌గా లేదన్న హైకోర్ట్‌.. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తన పరిధి దాటి వ్యవహరించిందని అభిప్రాయపడింది. కోర్టుకు సమర్పించాల్సిన డాక్యుమెంట్స్‌ను బహిర్గతం చేశారని అసహనం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌ను కూడా ఆర్డర్ కాపీలో ప్రస్తావించింది హైకోర్ట్‌. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎంకు సాక్ష్యాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని తీర్పు కాపీలో పేర్కొంది. దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదని హైకోర్ట్‌ అభిప్రాయపడింది.
తెలంగాణ ప్రభుత్వం జీవో 63 ద్వారా ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తును రద్దు చేసింది హైకోర్ట్‌. ఎఫ్ఐఆర్ 455/2022 కేసును సిబిఐ కు బదిలీ చేస్తున్నట్లు కాపీలో పేర్కొంది. ఇదిలా ఉండగా, హైకోర్ట్‌ ఆర్డర్ కాపీ సీబీఐకి చేరింది. దీంతో సీబీఐ కేసు నమోదు చేసి, తొలుత మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌ నుంచి వివరాలు సేకరించనుంది. మరో వైపు, సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ.. గురువారం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేయనుంది. ఈ వ్యవహారం ఇలా ఉంటే, ఈ కేసులో ప్రైమ్‌ పిటిషనర్‌గా ఉన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌ రెడ్డి తనను ఈడీ విచారణ చేయడంపై హైకోర్టును ఆశ్రయించారు. ఎటువంటి నగదు బదిలీ ప్రక్రియ లేకుండా ఈడీ విచారణ చేయడంప పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు.. కేసును జనవరి 5కు వాయిదా వేసింది.