Site icon HashtagU Telugu

Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించ‌నున్న ప్ర‌భుత్వం.. మంత్రి పొన్నం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

KCR Comments

KCR Comments

Former CM KCR: తెలంగాణ‌లో రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే విజయోత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) ను ప్రభుత్వం ఆహ్వానించ‌నుంది. ప్రభుత్వం తరపున ఆహ్వానాన్ని అందించేందుకు కేసీఆర్ సమయం కోరిన ప్రభుత్వం. తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను ఆహ్వానిస్తున్నామ‌ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. ముఖ్యమంత్రి గురువారం చెప్పిన విధంగా ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానించడానికి వారి సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతున్నామ‌ని మంత్రి తెలిపారు.

వాళ్ళు సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం ఇవ్వడం జరుగుతుందన్నారు. వారు ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం తరుపున విజ్ఞప్తి చేస్తున్నాను అని మంత్రి పొన్నం ఓ వీడియో విడుద‌ల చేశారు.

Also Read: Repo Rate: గుడ్ న్యూస్‌.. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయ‌ని ఆర్బీఐ..!

ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఈనెల 7, 8, 9 తేదీలలో జరిగే ముగింపు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇటీవ‌ల తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కూడా నిర్వ‌హించారు. ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీఏడీ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.