Bhukya Gowthami పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఒక ఇంగ్లీష్ టీచర్.. ఆ పని మానేసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం వైరల్ గా మారింది . ప్రభుత్వం ఉద్యోగంలో ఉంటూ కూడా ప్రయివేట్ విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల ప్రమోషన్స్ కోసం యాడ్స్ చేశారు. స్కూల్‌లో కూడా పిల్లల పాఠాలపై దృష్టి పెట్టకుండా రీల్స్ చేసుకుంటూనే కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు హెచ్చరించినా కూడా ఆమె తీరు మార్చుకోలేదు. దీంతో ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం హైస్కూల్ ఉపాధ్యాయురాలు గౌతమిని తాజాగా విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లల భవిష్యత్‌కి బాటలు వేయడంతో పాటుగా పాఠశాలల అభివృద్ధికి కూడా తోడ్పాటునందించాలని చెప్పారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సస్పెన్షన్ ఎత్తివేసాక అయినా బుద్ధిగా పిల్లలకు పాఠాలు చెప్పాలని ఆమెకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. లేకపోతే ఉద్యోగం మానేసి పూర్తిస్థాయి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అయినా మారిపోవాలని హితవు పలుకుతున్నారు.
పిల్లలకు పాఠాలు చెప్పకుండా రీల్స్ .. టీచర్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
Bhukya Gowthami పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఒక ఇంగ్లీష్ టీచర్.. ఆ పని మానేసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం వైరల్ గా మారింది . ప్రభుత్వం ఉద్యోగంలో ఉంటూ కూడా ప్రయివేట్ విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల ప్రమోషన్స్ కోసం యాడ్స్ చేశారు. స్కూల్‌లో కూడా పిల్లల పాఠాలపై దృష్టి పెట్టకుండా రీల్స్ చేసుకుంటూనే కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు హెచ్చరించినా కూడా ఆమె తీరు మార్చుకోలేదు. దీంతో ఖమ్మం జిల్లా […]

Bhukya Gowthami
Last Updated: 26 Jan 2026, 10:59 AM IST