Site icon HashtagU Telugu

Jr Doctors Protest : జూడాల డిమాండ్స్ ను నెరవేరుస్తాం అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు

Jr Doctors Protest Telangan

Jr Doctors Protest Telangan

ఎట్టకేలకు జూ. డాక్టర్ల సమ్మె (Jr Doctors Protest) విజయ వంతమైంది. జూడాల డిమాండ్స్ కు ప్రభుత్వం దిగొచ్చింది. రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వైప్ప్తామాగ్ జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. జూడాల సమస్యలపై మంగళవారం అర్ధరాత్రి దాకా డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో చర్చలు జరిగాయి. హాస్టల్‌ ఫెసిలిటీ, కాకతీయ రోడ్ల నిర్మాణం చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని తెలిపారు. వీటికి సంబంధించి జీవోలను విడుదల చేస్తామని ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఒకవేళ జీవోలు విడుదల చేయకపోతే మళ్లీ సమ్మె చేస్తామని డాక్టర్స్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టినట్లు బుధువారం మధ్యాహ్నం ప్రభుత్వం జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు ఉస్మానియా, గాంధీలో వసతి గృహాల నిర్మాణానికి, కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్ల పునరుద్దరణకు నిధులు విడుదల చేస్తూ.. ఉత్తర్వలు జారీ చేసింది. కాగా మరో ఆరు డిమాండ్లు పరిష్కరించే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

అసలు డాక్టర్ల డిమాండ్స్ ఏంటి అంటే..

గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెలా స్టైఫండ్ చెల్లింపు, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం, వైద్య కళాశాలలో పెంచిన 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు ఛాన్స్ ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇలా పలు డిమాండ్లతో సమ్మెకు దిగారు.

Read Also : Farmer Suicide Attempt : శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యాయత్నం

Exit mobile version