తెలంగాణ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్(Telangana Budget 2025-26 )లో కొత్త పథకాన్ని ప్రకటించింది. ‘ఇందిర గిరి జల వికాసం’ (Indira Giri Jala Vikasam) పేరుతో గిరిజన రైతుల అభివృద్ధికి నూతన ప్రణాళికను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ పథకం ద్వారా పోడు భూములపై సాగు చేసే గిరిజన రైతులకు సౌర ఆధారిత పంపుసెట్ల ద్వారా సాగునీటి సదుపాయం అందించనుంది. ప్రస్తుతం పోడు భూముల్లో సాగు చేస్తూ నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గిరిజన రైతులకు ఇది మేలు చేసే చర్యగా చెప్పొచ్చు.
Sunitha Williams : మీరు విజయవంతంగా తిరిగి రావడాన్ని గర్వంగా భావిస్తున్నాం: ప్రధాని
ఈ పథకం కింద పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులు, తోటల పెంపకానికి ప్రోత్సాహం అందించనున్నారు. ప్రభుత్వం 2.1 లక్షల మంది గిరిజన రైతులకు ఈ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపింది. దీని వల్ల వ్యవసాయ ఉత్పత్తి పెరుగడమే కాకుండా, ఆర్థికంగా వెనుకబడిన గిరిజన రైతులకు ఆర్థిక స్థిరత్వం లభించనుంది. సౌర ఆధారిత పంపుసెట్ల వల్ల విద్యుత్ ఖర్చు తగ్గి, పర్యావరణహిత సాగుకు మార్గం ఏర్పడనుంది.
Telangana Budget 2025 : శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి భట్టి విక్రమార్క
ఇందిర గిరి జల వికాసం పథకం నాలుగు సంవత్సరాల్లో పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం రూ. 12,600 కోట్లు కేటాయించింది. ఇది గిరిజన రైతుల సాగును ప్రోత్సహించే చర్యగా చెప్పొచ్చు. ఈ పథకం ద్వారా పర్యావరణ పరిరక్షణ, సాగునీటి వాడకంలో స్థిరత్వం, గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ కొత్త పథకాలను ప్రవేశపెట్టడం, వనవాసి రైతుల సంక్షేమానికి కృషి చేయడం ఆశాజనకమైన పరిణామంగా చెప్పొచ్చు.