Site icon HashtagU Telugu

Congress: కాంగ్రెస్ లో మొదలైన సంక్షోభం.. ఏకంగా 13 మంది రాజీనామా!

Pccc

Pccc

Congress : తెలంగాణ కాంగ్రెస్ లో రోజురోజుకీ రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. వలస వచ్చిన నాయకులకు పదవులు ఇస్తున్నారు అన్న సీనియర్ ల ఆరోపణలతో టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఒక్కొక్కరుగా రాజీనామా బాట పట్టారు. ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరిన 13 మంది నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ పదవులకు రాజీనామా చేసిన వారి జాబితాలో వేం నరేందర్ రెడ్డి,సీతక్క, విజయ రామారావు, చారగొండ, వెంకటేష్, ఎర్ర శేఖర్, పటేల్ రమేష్ రెడ్డి, సత్తు మల్లేష్ తో పాటు పలువురు నేతలు రాజీనామా చేశారు.

కాగా రాజీనామా చేసిన నేతలు అందరూ వారి రాజీనామా లేఖలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ కు పంపిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాదులోని ఇందిరా భవన్ లో కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుండగా మరొకవైపు 13 మంది నేతలు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పదవులకు రాజీనామా చేయడంతో ఈ వార్త ఒక్కసారిగా తెలంగాణలో సంచలనం సృష్టించింది. అయితే ఈ మీటింగ్ కు సీనియర్లు ఎవరు కూడా హాజరు కాలేదు.

అంతేకాకుండా పీసీసీ రేవంత్ పై నిరసనగలం వినిపించిన ఏ ఒక్కరు కూడా మీటింగ్ కు హాజరు కాలేదు. అయితే టిడిపి నుంచి వలస వచ్చిన నేతల రాజీనామా సంఖ్య అంతకంతకు పెరిగే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం ఇంకా ఎంత వరకు వెళ్తుందో చూడాలి మరి.

Exit mobile version