Site icon HashtagU Telugu

Telangana Congress: ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ సమన్వయ కమిటీ

Jai Bapu Jai Bhim Jai Samvidhan Telangana Congress Coordination Committee Rahul Gandhi

Telangana Congress: కాంగ్రెస్ పార్టీ జనవరి 26న ఉత్తరప్రదేశ్‌లోని మౌలో ‘జై బాపు , జై భీమ్ , జై సంవిధాన్ అభియాన్’‌ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.  ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఆరుగురు నేతలకు చోటుదక్కింది. ఈ జాబితాలో  కాంగ్రెస్ నేతలు చల్లా వంశీచంద్ రెడ్డి, ఎస్. ఎ. సంపత్ కుమార్, ఎం. అనిల్ కుమార్ యాదవ్, తాహెర్ బిన్ హమ్దాన్, తజావత్ బెల్లయ్య నాయక్, వెన్నెల గద్దర్‌ ఉన్నారు. ఈమేరకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆరుగురు నేతలతో సమన్వయ కమిటీ(Telangana Congress) ఏర్పాటుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆమోదం పొందినట్లు ఆయన వెల్లడించారు.

Also Read :Kulbhushan Jadhav: కులభూషణ్‌‌ను పాక్‌కు పట్టించిన ముఫ్తీ షా మిర్‌ హతం.. ఎవరు ?

ఏమిటీ ప్రచార కార్యక్రమం ? 

‘జై బాపు , జై భీమ్ , జై సంవిధాన్ అభియాన్’ ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహించనుంది.ఇందులో భాగంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని ఎలా అగౌరవపర్చాయో చర్చించేందుకు ప్రతి జిల్లాలో గ్యాలరీలను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రచార కార్యక్రమానికి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ సారథ్యం వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం పరిధిలో జరిగే పలు ర్యాలీల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది.

Also Read :Dawood Ibrahim: రంగంలోకి దావూద్ గ్యాంగ్.. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ !

రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు

తాజాగా శనివారం రోజు (మార్చి 8న) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలు కాంగ్రెస్‌లో ఉంటూనే బీజేపీకి బీ టీమ్‌గా పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాంటి వాళ్లను తప్పకుండా ఫిల్టర్ చేస్తామని వెల్లడించారు. తాను ఎప్పుడు గుజరాత్‌కు వచ్చినా 2007, 2012, 2017, 2022, 2027 అంటూ ఎన్నికల సంవత్సరాల గురించి రాష్ట్ర కాంగ్రెస్  నేతలు చెబుతున్నారే తప్ప..  మనం మన బాధ్యతలను ఎంతవరకు నిర్వర్తించామనేది ఎవరూ చెప్పడం లేదన్నారు. ప్రతీ నాయకుడు పార్టీపరమైన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే తప్పకుండా గుజరాత్ ప్రజలు ఆశీర్వదిస్తారని తెలిపారు. నాయకులంతా పార్టీపరమైన బాధ్యతలను నెరవేర్చే వరకు అధికారం ఇవ్వమని రాష్ట్ర ప్రజలను అడగకూడదన్నారు.