TS BJP : తెలంగాణ బీజేపీ నేతలపై..హైకమాండ్ ఆగ్రహం..!!

  • Written By:
  • Updated On - October 29, 2022 / 12:23 PM IST

TRS ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంశం దేశరాజకీయాల్లో హాట్ టాపిక్ గ్గా మారింది. శుక్రవారం నాటి పరిణామాలు మరోసారి సంచలనాలకు తెరతీశాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని…దానిలో భాగంగానే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అదంతా టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా..అంటూ బీజేపీ ఎదురు దాడికి దిగుతోంది. ఈ వ్యవహారాన్నంతా లైట్ తీసుకున్న బీజేపీ హైకమాండ్…శుక్రవారం నాడు ఆడియో టేపులు లీక్ అవ్వడం అందులో బీజేపీ అగ్రనేతల పేర్లు ఉండటంతో సీరియస్ తీసుకుంది. మునుగోడులో బీజేపీని దెబ్బకొట్టేందుకే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ బీజేపీ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొయినాబాద్ ఘటన గురించి తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు.

ఆ ముగ్గురిలో ఎవరికీ పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు లేవని ఢిల్లీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, అని మాట్లాడుకోవడంతో పార్టీ పెద్దలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీలో వీరికి ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై అధిష్టానం ఆరా తీస్తుందట. వారి పూర్తి వివరాలను సేకరించే పనిలో పడిందట. పార్టీ జాతీయ నాయకత్వంపైన్నే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని అంతఈజీగా తీసుకోవద్దని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం.