తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత బిఆర్ఎస్ (BRS) కు వరుస షాకులు తప్పడం లేదు. వరుసపెట్టి నేతలు పార్టీ కి రాజీనామా (Resign) చేసి..కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే పలువురు కింది స్థాయి నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా..ఇక ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు , కీలక నేతలు కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధం అవుతున్నారు.
తాజాగా తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah ) బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అతి త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. గత కొంత కాలంగా బీఆర్‌ఎస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్న తాటికొండ రాజయ్య ..ఇక ఇప్పుడు ఏకంగా రాజీనామా చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను రాజయ్య ఆశించినప్పటికీ..కేసీఆర్ ఆయనకు కాకుండా కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచే ఇంకాస్త ఆగ్రహంతో ఉన్నారు. తన అనుచరులతో లోతుగా చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పడమే బెటర్ అనే నిర్ణయానికి ఆయన వచ్చారు.
ఇప్పటికే ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం… రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. మొన్నటికి మొన్న కేసీఆర్ సైతం గెలిచినా ఎమ్మెల్యేలకు పలు సూచనలు తెలియజేసారు..కాంగ్రెస్ ఆఫర్లకు లోనుకావొద్దని , ప్రజలను మనల్ని నమ్మి గెలిపించారని ..పార్టీ మారడం వంటివి చేయకూడదని హెచ్చరించారు. కానీ నేతలు మాత్రం కాంగ్రెస్ వైపే చూస్తున్నట్లు తెలుస్తుంది.
Read Also : Sohel : నా సినిమా చూడడానికి ఎందుకు రావట్లేదు..అంటూ కన్నీరు పెట్టుకున్న హీరో సోహెల్