Site icon HashtagU Telugu

Thatikonda Rajaiah : కేసీఆర్ తో తాటికొండ రాజయ్య భేటీ..? మళ్లీ బిఆర్ఎస్ లోకా..?

Rajayya Brs

Rajayya Brs

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ (BRS) పార్టీలో ఏంజరుగుతుందో..? ఎవరు పార్టీని వీడుతున్నారో..? ఎవరు పార్టీలోకి వస్తున్నారో..? ఈరోజు పార్టీలో నేత..రేపు పార్టీ లో ఉంటారా..ఉండారా..? అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ నుండి వరుసగా నేతలు బయటకు వస్తున్నారో. అసలు పార్టీని వీడారు అనుకున్నవారు సైతం పార్టీని వీడుతుండడం అందరికి షాక్ ఇస్తుంది. కడియం , కేకే, దానం , పట్నం , ఇలా ఎంతో మంది చిన్న స్థాయి నేతల దగ్గరి నుండి కీలక పదవులు అనుభవించిన వారి వరకు అంత పార్టీని వీడుతున్నారు. దీంతో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్ధే లేకుండా పోయే పరిస్థితి బిఆర్ఎస్ కు ఏర్పడింది. దీంతో గతంలో పార్టీని వీడి ఖాళీగా ఉన్న నేతలను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించాలని కేసీఆర్ (KCR) చూస్తున్నారు. ఇప్పటికే బాబు మోహన్ కు ఫోన్ చేసినట్లు వార్తలు వినిపిస్తుండగా…తాజాగా తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) మరోసారి బిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు తాజాగా సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మినిస్టర్ క్వార్టర్స్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహార ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ మర్యాద పూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు. ఈ మేరకు ఆయన రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉండగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య..మళ్లీ బిఆర్ఎస్ లో చేరాలని భావిస్తున్నారట. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాజయ్యతో హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ నేతలు ఆయనతో మంతనాలు జరుపున్నట్లుగా సమాచారం. ఈరోజు సాయంత్రం రాజయ్య నేరుగా కేసీఆర్ తో భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. వరంగల్ నుండి బిఆర్ఎస్ ఎంపీగా టికెట్ ఇవ్వాలని రాజయ్య..కేసీఆర్ ను కోరే అవకాశం ఉంది. మరి ఏంజరుగుతుందో చూడాలి.

Read Also : RRR : టిక్కెట్‌పై రఘురామకృష్ణంరాజుకు విశ్వాసం ఏంటి.?